Transgender Clinic: ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక వైద్యసేవలు అందించే దిశగా కీలక అడుగు పడింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ని ప్రారంభించింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశృతి చోటుచేసుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొల్లాపూర్ మండలం ఏలూరు శివార్లలోని రేగమనగడ్డ వద్ద ప్రమాదం చోటుచేసుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ వన్‌లో రేగమనగడ్డ వద్ద పంపు హౌస్‌ను నిర్మిస్తున్న క్రమంలో కార్మికులు క్రేన్ సహాయంతో పంపు హౌస్‌లోకి దిగుతున్నారు. దీంతో ఒక్కసారిగా క్రేన్ వైరు తెగిపోయింది. ఆక్రైన్ దిగుతున్న కార్మికులపై పడటంతో.. దీంతో.. ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొక కార్మికునికి తీగ్రంగా గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి…
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసులో రోజుకో ట్విస్ట్ వస్తూనే ఉంది. సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మైనర్‌పై సామూహిక లైంగిక దాడి ఘటనలో ఇప్పటికే బాధితురాలి మెడికల్ రిపోర్టును వైద్యులు,పోలీసులకు అందించారు. కాగా, పోలీసులు ఇప్పటికే మైనర్‌కు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ మెడికల్ రిపోర్ట్ ప్రకారం లైంగిక దాడి జరిగే సమయంలో మైనర్ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఆ సమయంలో మైనర్ లైంగిక…
సవాలపై వేసే పేలాలు అమ్ముకునేలా వుంది నీ భాగోతం అనే సామెత మనం కామెడిగానో.. లేదంటే.. కోపంలోనే.. అంటూనో వింటూనో వుంటాం. కానీ అది నిజ జీవితంలో నిజమైవుతోంది. కుటుంబంలోని వ్యక్తి చనిపోతే పుట్టెడు దుఖంలో వున్న కుటుంబాలకు సహాయం చేయాల్సింది పోయి అదే ఆశరాగా చేసుకుని మృతదేహంపై కూడా చిల్లర అడుక్కునే రకానికి దిగజారుతున్నారు. అదికూడా మార్చురీలో తీసుకెల్లేందుకు కాసులిస్తేనే లోపలికి మృతదేహాన్ని పంపిస్తా అంటూ బేరసారాలు చేశాడు. పుట్టెడు దుఖంలో వున్న కుటుంబం కన్నీరు…
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను అధికారులు భద్రపరచారు. వారిలో ఒకరిని బంధువు గుర్తించడంతో మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తరువాత అసలు విషయం తెలిసి అందరూ షాక్‌కు గురయ్యారు. ఓజీహెచ్ మార్చురీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వేర్వేరు కేసుల్లో మృతదేహాలను మైలార్‌దేవ్‌పల్లి, ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు మార్చురీకి తీసుకొచ్చి గుర్తింపు కోసం ఉంచారు. అయితే గురువారం ఓ బంధువు వచ్చి ఒక మృతదేహాన్ని గుర్తించడంతో అధికారులు మృతదేహాన్ని కుటుంబ…
హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రితో ఓ అరుదైన సర్జరీ జరిగింది. కాలిన గాయాలతో బాధపడుతున్న నవీన్ అనే యువకుడికి హోమో గ్రాఫ్ట్ సర్జరీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి ఉస్మానియాలో స్కిన్ బ్యాంక్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. చనిపోయినవారి స్కిన్ తీసుకొని 45 రోజులపాటు ప్రాసెస్ చేసిన తరువాత హోమోగ్రాఫ్ట్ చేస్తారు. కాలిన గాయాలపై స్కిన్‌తో సర్జరీ చేస్తారు. ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రిలో స్కిన్ బ్యాంక్ కోసం ఇద్దరి నుంచి చర్మాన్ని సేకరించినట్టు వైద్యులు తెలిపారు. ఉస్మానియాలో చేసిన…
ఉస్మానియా ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.7కోట్లతో క్యాథ్‌ల్యాబ్, సిటీ స్కాన్ లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా మరో నాలు క్యాథ్ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసువస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్య అందేలా ఏర్పాటు చేస్తున్నామని, ఉస్మానియా అస్పత్రిలో రూ.5 కోట్లతో అధునాతన మార్చురీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాత్రి పూట పోస్టుమార్టం చేసేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఆయన అన్నారు.…
వైద్యులు హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఈ దృశ్యం కన్పించింది. నిన్న ఆస్పత్రిలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి ఓ వైద్యురాలి తలకు గాయమైంది. దీంతో వైద్యులు ఈ రోజు హెల్మెట్లు ధరించి ఆస్పత్రిలో విధులకు వచ్చారు. ఆస్పత్రిలో శిథిలమైన సీలింగ్ ఫ్యాన్లను చూసి భయపడుతున్నారు. ఎప్పుడు, ఎక్కడా ఏ ఫ్యాన్ ఊడి మీద పడుతుందోనని భయాందోళనలు చెందుతున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో రోగులకు, వైద్యులకు రక్షణ లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకుని,…
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆగ్రస్థానంలో ఉస్మానియా ఆసుపత్రి ఉంది. పేదవారికి సంజీవినిలా ఉన్న ఈ ఆసుపత్రిలో సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఉస్మానియా ఆసుపత్రిలో డెర్మటాలజీ విభాగంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. డెర్మటాలజీ డిపార్ట్‌మెంట్‌లో డ్యూటీలో ఉన్న భువనశ్రీ అనే మహిళా డాక్టర్ పై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. దీంతో ఆమె తలకు గాయాలయ్యాయి. పేద ప్రజలకు ఆపద్భాంధువులా ఉండే ఈ ఉన్నత శ్రేణి ఆసుపత్రిలో ఇలా జరగడంతో చికిత్సకు వచ్చిన…