Sharad Pawar: విపక్షాల ఐక్యత కోసం దేశంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్న వస్తోంది. తాజాగా దీనిపై స్పందించారు శరద్ పవార్. తాను ప్రధాన మంత్రి రేసులో లేనని ప్రకటించారు.
Badruddin Ajmal: కర్ణాటకలో బీజేపీ పరాజయంతో 2024 ఎన్నికల్లో విపక్షాల కూటమి అనేది చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీని ఓడించాలంటే విపక్షాల ఐక్యత ముఖ్యమని భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే అస్సాంకు చెందిన వివాదాస్పద నేత, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్, విపక్ష కూటమి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడేందుకు విపక్ష కూటమిలో చేరాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు.
బిజెపి నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష శక్తులను ఏకం చేసే పనిని స్వయంగా తీసుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవనున్నారు. మోడీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా బిహార్ సీఎం నితీష్ వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారు. ఇప్పటికే పలువురు విపక్ష నేతలను కలిశారు.