Dharmana Prasada Rao: రాష్ట్రంలో కుట్ర జరుగుతోంది.. సీఎం వైఎస్ జగన్ సర్కార్‌పై కుట్ర చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన 80 ఏళ్ళు అయినా ఇంకా కొన్ని సామాజిక వర్గాలు వెనుకబడే ఉన్నాయన్నారు.. గత ప్రభుత్వాలు ఈ పరిస్థితిని సరిదిద్దలేక పోయాయన్న ఆయన.. వైఎస్ జగన్ ప్రభుత్వమే ధైర్యంగా అన్ని వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపిందన్నారు.. చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించారు.. కానీ,…
Naveen Patnaik: ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ అధినేత విపక్షాల పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ విపక్షాలతో కలిసి పోటీ చేయమని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీ ఒంటరిగానే పోలీ చేస్తుందని ప్రకటించారు. ఈ రోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని డిమాండ్ల గురించి ప్రధాని మోడీని కలిసినట్లు చెప్పారు.
కేంద్రంలోని మోడీ సర్కార్ ను గద్దె దించేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం దేశంలోని విపక్ష పార్టీలను ఏకం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులను ఆయన ఇప్పటికే ఢిల్లీలో కలిశారు.
కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఏకం అవుతున్నాయి. 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరు కలిసి కట్టుగా ఉండి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భావిస్తున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు, భయపెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ 14 ప్రతిపక్ష పార్టీలు వేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలు ఏకం అవుతున్నాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం, దేశంలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడంపై బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం కూడా తమ ‘నల్ల’ నిరసనను కొనసాగించాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి.
దేశంలోని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సహా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీష్ కుమార్ కోరారు. ఈ "ప్రతిపక్షాల ప్రధాన ఫ్రంట్" 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ ఘోరంగా ఓడిపోయేలా చేస్తుందని ఆయన అన్నారు.
Vice President Candidate: ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించే విషయంలో ప్రతిపక్షాలు వెయిట్ అండ్ సీ పాలసీని ఫాలో అవుతున్నాయి. అందుకే ఇప్పటివరకు ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. అధికార కూటమి (ఎన్‌డీఏ) క్యాండేట్ పేరును ప్రకటించాకే తమ అభ్యర్థి పేరును వెల్లడిస్తామని చెబుతున్నాయి.
రాష్ట్రపతి ఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారింది. ఓ వైపు బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుందని.. మరోవైపు విపక్షాల అభ్యర్థి ఎవరోనని ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో విపక్షాలు అభ్యర్థి ఎంపిక కోసం ఇవాళ సమావేశం కానున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను అభ్యర్థిగా ప్రకటించాలని విపక్షాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ రాష్ట్రపతి రేసుకు దూరంగా ఉండాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండబోనని…