కేంద్రంలోని మోడీ సర్కార్ ను గద్దె దించేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం దేశంలోని విపక్ష పార్టీలను ఏకం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులను ఆయన ఇప్పటికే ఢిల్లీలో కలిశారు. తాజాగా దేశవ్యాప్తంగా పర్యటనకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు. ప్రముఖ ప్రతిపక్ష నేతలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన అనంతరం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శుక్రవారం మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు దేశవ్యాప్తంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Also Read:Karnataka: ఎన్నికలకు ముందు బీజేపీకి రెబెల్స్ తలనొప్పి.. అసమ్మతిని తగ్గించేదెలా?
తన ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్, ఆప్, వామపక్ష పార్టీల నాయకులతో లోతైన చర్చలు జరిపారు. ప్రతిపక్షాల ఐక్యతపై వారంతా అంగీకరించారు. గరిష్ట సంఖ్యలో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు దేశవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. బీహార్‌లో మహాఘట్‌బంధన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతిపక్షాల ఐక్యత కోసం నితీష్ ప్రయత్నిస్తున్నారు. ఎన్డీయే నుంచి వైదొలగాలన్న తన నిర్ణయాన్ని అందరూ మెచ్చుకున్నారని నితీష్ తెలిపారు.
Also Read:Mirnalini Ravi: చీరకట్టులో కోలీవుడ్ ముద్దుగుమ్మ కేక పెట్టిస్తోందే
ఇక,బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జేడీయూ కార్యాలయంలో జరిగిన సభలో నితీశ్ ప్రసంగించారు. జెడి-యు కార్యాలయానికి చేరుకున్న నితీష్ కుమార్‌కు గులాబీ రేకుల వర్షం కురిపించి, ‘దేశ్ కా పిఎం కైసా హో నితీష్ కుమార్ జైసా హో’ నినాదాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వంపై నితీష్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేంద్రంలో కూర్చున్న వ్యక్తులు పనిని నమ్మరని, కేవలం ప్రచారాన్ని మాత్రమే నమ్ముతారని ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తాము పనిని నమ్ముతాము, సామాన్య ప్రజల సంక్షేమం కోసం అనేక పనులు చేస్తున్నామన్నారు. మరోవైపు, కేంద్రంలో కూర్చున్న వ్యక్తులకు పనితో సంబంధం లేదని విమర్శించారు. వారు కేవలం ప్రకటనలు చేయాలనుకుంటున్నారు. ఈ వ్యక్తులకు స్వాతంత్ర్య పోరాటంలో ఎటువంటి సహకారం లేదు, అందుకే వారు దేశ చరిత్రను మార్చాలనుకుంటున్నారు అని నితీష్ కుమార్ మండిపడ్డారు.