Raj Thackeray: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. రాష్ట్ర ఓటర్ల జాబితాలలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ మహా వికాస్ అఘాడి (MVA), రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) నాయకులు శుక్రవారం ముంబైలో సమావేశమయ్యారు
మహాఘట్‌బంధన్‌లో ఉన్నవారంతా నేరస్థులేనని.. వారంతా బెయిల్‌పై తిరుగుతున్నారని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. శుక్రవారం ప్రధాని మోడీ బీహార్‌లోని సమస్తిపూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
26 రాజకీయ పార్టీల ప్రతిపక్ష కూటమిని ‘INDIA’ అనే పదాన్ని ఉపయోగించకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ప్రతిపక్ష కూటమి పేరు INDIA (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) అని తెలిసిందే.
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మణిపూర్ సంక్షోభంపై కేంద్రంపై విమర్శలు గుప్పించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీ 'బేటీ బచావో' పథకం ఇప్పుడు 'బేటీ జలావో' (మా కుమార్తెలను కాల్చండి)గా మారిందని అన్నారు.
విపక్ష కూటమికి ఇండియాగా పేరు పెట్టినట్లు సోమవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ఈ ఇండియా పేరును తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్టు తెలుస్తోంది. దీనిపై నేతలలంతా లోతుగా చర్చించి, ఏకాభిప్రాయంతో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియా అనే పేరును బిహార్ సీఎం నితీష్ కుమార్ గట్టిగా వ్యతిరేకించినట్లు సమాచారం.
బెంగళూరు వేదికగా విపక్షా కూటమి రెండు రోజు సమావేశం ముగిసింది. ఉదయం 11 నుంచి ప్రారంభించి మధ్యాహ్నం 4 గంటల వరకు భేటీ జరిగింది. దాదాపు 26 ప్రతిపక్ష పార్టీలు సమావేశంలో పాల్గొన్నాయి. బీజేపీకి పోటీగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమికి కొత్త పేరును నిర్ణయించారు.
రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్‌ను రూపొందించే ప్రయత్నంలో 26 పార్టీల నాయకులు రెండో రోజు సమావేశమయ్యారు. కాంగ్రెస్‌కు అధికారంపైనా, ప్రధాని పదవిపైనా ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశంలో అన్నారు.
యూపీఏ.. కాంగ్రెస్ సారథ్యంలో పదేళ్లపాటుదేశాన్ని ఏలిన ఐక్య ప్రగతిశీల కూటమి. 19 ఏళ్లుగా ఆ కూటమిని కాంగ్రెస్ లీడ్ చేసింది. అయితే ఇకపై ఈ పేరు కనుమరుగు కాబోతోందని జాతీయ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు అజిత్ పవార్ తన మద్దతుదారులతో బిజెపిలోకి వెళ్తున్నారన్న ప్రచారం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. అజిత్ కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో షిండే- ఫడ్నవీస్ ప్రభుత్వంతో చేతులు కలపాలని భావిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.