వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించేడమే లక్ష్యంగా విపక్షాలు కూటమిగా ఏర్పాడ్డాయి. ఇందులో భాగంగా పట్నాలో తొలి భేటీ జరిగింది. తర్వాత బెంగళూరులో రెండోసారి సమావేశమయ్యారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, జేడీయూ, సహా 26 పార్టీల అధినేతలు, పార్టీ సీనియర్ నేతలు ఈ మీటింగ్ లో పాల్గొని పలు కీలకమైన అంశాలపై చర్చించారు. అయితే, విపక్ష కూటమికి ఇండియాగా పేరు పెట్టినట్లు సోమవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ఈ ఇండియా పేరును తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్టు తెలుస్తోంది. దీనిపై నేతలలంతా లోతుగా చర్చించి, ఏకాభిప్రాయంతో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియా అనే పేరును బిహార్ సీఎం నితీశ్ కుమార్ గట్టిగా వ్యతిరేకించినట్లు సమాచారం. విపక్షాల కూటమి పేరు గురించి కాంగ్రెస్ ఏ విధంగానూ తనతో చర్చించలేదని అతడు చెప్పుకొచ్చినట్లు తెలిపారు.
Read Also: MP Komatireddy: కోమటిరెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ల సమావేశం.. పార్టీ చేరికలపై చర్చ
ఈ ఇండియా అనే పేరులో ఎన్డీయే అక్షరాలు ఉండటంపై నితీశ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కూటమికి ఆ పేరు ఎలా పెడ్తారని భేటీలోనే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నితీశ్ తోపాటు వామపక్ష నేతలు కూడా ఇండియా పేరుపై అభ్యంతరం చేస్తూ మరో పేరును సూచించినట్లు టాక్. కానీ మెజార్టీ పార్టీలు ఆమోదించడంతో నితీశ్ కుమార్ సైతం చివరికి ఒప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవడంలో నితీశ్ కుమార్ పాత్ర ఎంతో కీలకమైనది. విపక్షాల తర్వాతి భేటీ మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగనుంది. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం ఈ మీటింగ్ ను ఏర్పాటు చేస్తుంది. ఈ సమావేశంలోనే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే అశం, సీట్ల సర్ధుబాటుపైనా ఆరోజే చర్చించే అవకాశం ఉందని నేతలు చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కలిసి కట్టుగా పోరాడి విజయం సాధిస్తామని విపక్ష కూటమి ధీమా వ్యక్తం చేసింది.
Read Also: Minister Roja: సినిమాలో హీరో పాలిటిక్స్‌లో జీరో.. పవన్‌పై రోజా కీలక వ్యాఖ్యలు