శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌పోర్ట్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఔట్ పోస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీపీ అవినాష్ మహంతి, ఎయిర్‌పోర్ట్ సీఈఓ ప్రదీప్ ఫనికర్, సీఐఎస్ఎఫ్‌డీజి మొహంక్య తదితరులు పాల్గొన్నారు.
తాడిపత్రిలో ప్రముఖ ఫ్యాషన్ షోరూం కాసం షోరూంను సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రారంభించారు. షోరూమ్‌లో అన్ని వయసుల వారికి సరిపోయే చీరలతో సహా అనేక రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. కాసం సంస్థల చైర్మన్ కాసం నమశివాయ మాట్లాడుతూ.. తాడిపత్రిలో కాసం ఫ్యాషన్ షో ప్రారంభించామన్నారు. తమ సంస్థ వరంగల్‌లో మొదటి స్టోర్‌ను ప్రారంభించామని.. అనంతరం రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ప్రాంతాల్లో కూడా తమ స్టోర్స్ ఓపెన్ చేశామని తెలిపారు.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొత్తగూడెంలో 36వ షోరూంను ప్రారంభించించింది. స్థానికంగా కొత్తగూడెం.. పరిసరాలలోను నివసించే వారి సరికొత్త జీవన శైలికి, వ్యక్తిగత అభిరుచులకు అచ్చంగా సరితూగే షాపింగ్ అవసరాలను, వైవిధ్యభరిత వస్త్రాలను సాటిలేని నాణ్యతతో.. సరసమైన ధరలకు విక్రయించటంతో పాటు అద్భుతమైన షాపింగ్ అనుభూతిని సైతం అందించగలదు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి కొత్తగూడెం స్థానిక ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ గ్రూప్ తమ 32వ షాపింగ్ మాల్ను కరీంనగర్లోని మార్కెట్ రోడ్ లో శుక్రవారం ఉదయం 9.38 గం.కు భూంరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా చలిమెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆచలిమెడ లక్ష్మీ నరసింహరావు, డా. వి. సూర్యనారాయణ రెడ్డి. డా. భూంరెడ్డి హాస్పిటల్స్, డా. వి. రమాదేవి, మొదటి కొనుగోలుదారు చిదుర సురేష్, తదితరులు పాల్గొన్నారు.
గత 50 సంవత్సరాలుగా టెక్స్టైల్, జ్యూవెలరీ రంగాలలో ఎంతో ప్రావీణ్యం పొందిన అనుటెక్స్ మల్కాజిగిరి వారు ఇప్పుడు ప్రప్రథమంగా ప్రగతి నగర్, కూకట్ పల్లి నందు " అను జ్యూవెలర్స్ " Exclusive జ్యూవెలరీ షోరూంను ప్రారంభించటం జరిగింది.
సుధీష్ వెంకట్ మరియు అంకిత సాహ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ.”పాషన్”. ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ఈ సినిమాను తోలు బొమ్మలాట ఫిల్మ్స్ బ్యానర్ పై డాక్టర్ అరుణ్ మొండితోక మరియు నరసింహ, ఏ పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు.”పాషన్” చిత్రంతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా దర్శకుడిగా వెండి తెరకు పరిచయమవుతున్నారు.అరవింద్ జోషవా ఇంతకుముందు పాపులర్ డైరెక్టర్స్ శేఖర్ కమ్ముల,మదన్ మరియు మోహన కృష్ణ ఇంద్రగంటి…
సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో అతిపెద్ద ఔట్ లెట్ మాల్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ను సినీ హీరో బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రీటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటోంది అని అన్నారు.
కీర్తి సురేష్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన నటనతో సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని తో కలిసి నటించిన దసరా మూవీ తో ఈ భామ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. కానీ ఆ తరువాత చేసిన భోళా శంకర్ సినిమా నిరాశ పరిచింది. అయినా కానీ ఈ భామ వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్…
2వ ఇంటర్ ఫుడ్‌టెక్ ఎక్స్‌పోను జూన్ 7 నుండి 9 వరకు ముంబైలో నిర్వహించనున్నారు. 'స్నాక్ & బేకెటెక్' మరియు 'పాక్ మెచెక్స్' పేరుతో ఏకకాలంలో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు నిర్వాహకులు. అంతేకాకుండా అధునాతన పరిష్కారాలు మరియు పరిశ్రమలో తాజా ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు.