కీర్తి సురేష్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన నటనతో సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని తో కలిసి నటించిన దసరా మూవీ తో ఈ భామ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. కానీ ఆ తరువాత చేసిన భోళా శంకర్ సినిమా నిరాశ పరిచింది. అయినా కానీ ఈ భామ వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందుకుంటుంది. కీర్తి సురేష్ సినిమాలతో పాటుగా టెలివిజన్ యాడ్స్ లో కూడా నటించి మెప్పిస్తుంది. అలాగే పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లు కూడా హాజరయి ఎంతో సందడి చేస్తుంది. తాజాగా
తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ తమ యొక్క మరో ప్రతిష్టాత్మకమైన షాపింగ్ మాల్‌ను నేడు బాలాపూర్‌లో కీర్తి సురేష్ మరియు గౌరవనీయులైన రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గార్ల చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరుపుకున్నది. ఈ ప్రారంభోత్సవం లో కీర్తి సురేష్ చీర కట్టులో మెరిసింది. తన అభిమానులతో కీర్తి ఎంతగానో సందడి చేసింది. ఆమె కోసం అభిమానులు భారీగా తరలి వచ్చారు.
అలాగే సీఎంఆర్ సంస్థ అధినేత శ్రీ అల్లక సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఇక నుండి బాలాపూర్ మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాల వారు ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌లో గంటల తరబడి ప్రయాణాలు చేసి సిటీకి వెళ్లి షాపింగ్ చేయవలసిన అవసరం లేకుండా 5 అంతస్థులు, 25,000 చదరపు అడుగులలో కుటుంబం అంతా కలిసి షాపింగ్ ఒకోచోట చేసుకునే విధంగా పట్టు, ఫ్యాన్సీ, హై–ఫ్యాన్సీ, చుడీదార్స్, వెస్ట్రన్‌వేర్, బెడ్ షీట్స్, మెన్స్ బ్రాండెడ్, కిడ్స్ వేర్, ఎథినిక్ వేర్‌లతో సహా ఒక్కో విభానికి ఒక్కో అంతస్థు కేటాయిస్తూ ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని ఇస్తూ.. మార్కెట్ ధరల కన్నా తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నామని ఈ షాపింగ్ మాల్ ద్వారా మరో 300 మందికి ఉపాధి కల్పిస్తున్నామని తెలియజేశారు.ఈ ప్రారంభోత్సవ వేడుకను ఇంతటి ఘన విజయం చేకూర్చినందుకు కస్టమర్లకు మరియు పోలీస్ శాఖ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.