Passion : మరో హ్యాపీ డేస్ మూవీలా ‘పాషన్’ మూవీ.. వైరల్ అవుతున్న శేఖర్ కమ్ముల కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుధీష్ వెంకట్ మరియు అంకిత సాహ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ.”పాషన్”. ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ఈ సినిమాను తోలు బొమ్మలాట ఫిల్మ్స్ బ్యానర్ పై డాక్టర్ అరుణ్ మొండితోక మరియు నరసింహ, ఏ పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు.”పాషన్” చిత్రంతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా దర్శకుడిగా వెండి తెరకు పరిచయమవుతున్నారు.అరవింద్ జోషవా ఇంతకుముందు పాపులర్ డైరెక్టర్స్ శేఖర్ కమ్ముల,మదన్ మరియు మోహన కృష్ణ ఇంద్రగంటి వంటి వారి వద్ద పనిచేశారు. ఇటీవల హైదరాబాద్ లో “పాషన్” సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ను ఇచ్చారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మొండితోక కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. దర్శకుడు వేణు ఊడుగుల గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత పద్మనాభ రెడ్డి స్క్రిప్ట్ ను దర్శకుడు అరవింద్ జోషువాకు అందజేశారు.
ఇది చాలా మంచి కథ. నేను అంతా కొత్తవాళ్లతో తీసిన హ్యాపీడేస్ మూవీ లా పాషన్ సినిమా కూడా యూత్ ని ఆకట్టుకుని, ఇన్ స్పైర్ చేసే మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నాను” అని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెలిపారు.”ఎక్కడా కాంప్రమైస్ కాకుండా కేవలం కథని, దాన్ని హానెస్ట్ గా సినిమాగా తీయడాన్నే నమ్మిన డైరెక్టర్ అరవింద్. అదే సినిమాకి బలమని నమ్ముతున్నాం. త్వరలోనే మా సినిమాను రెగ్యులర్ షూటింగ్ కు తీసుకెళ్తాం” అని నిర్మాత అరుణ్ మొండితోక తెలిపారు.సినిమా ఫలితం ఎలా ఉంటుందనే ఆలోచన లేకుండా కేవలం కథను నమ్మి మా ప్రొడ్యూసర్స్ అరుణ్ మరియు పద్మనాభ రెడ్డి గార్లు సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు. వారికి నా థ్యాంక్స్ చెబుతున్నా. మేము అనుకున్న సబ్జెక్ట్ ను నిజాయితీగా తెరకెక్కించాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాం. మా సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చి బ్లెస్ చేసిన మా గురువు శేఖర్ కమ్ముల గారికి కృతజ్ఞతలు చెబుతున్నా” అని మూవీ డైరెక్టర్ అరవింద్ జోషవా తెలిపారు.
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!