Online Gaming Fraud: ఎవరైనా నిజమైన ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతూ డబ్బు సంపాదించారా? అవుననే సమాధానం ఎవరి నుంచి రాదు. ఎందుకంటే ఆన్ లైన్ గేమ్స్ అంతా ఒక భూటకమనే చెప్పాలి.
ఆన్‌లైన్ లోన్‌యాప్స్ ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిర్వాహకులు జలగల్లా పట్టుకుని అమాయకుల రక్తం తాగేస్తున్నారు. బరితెగించి మరి వేధిస్తున్నారు. లోన్ యాప్‌ల ద్వారా రుణాలిచ్చి, తర్వాత అధికంగా డబ్బు కట్టాలంటూ వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అశ్లీల ఫొటోలు పంపి మరింత ఇబ్బందులకు గురిచేసే ఘటనలు పేట్రేగుతున్నాయి. తీసుకున్న రుణానికి ఒక్కోసారి రెండు నుంచి నాలుగు రెట్ల సొమ్మును వసూలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నించిన వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి, అశ్లీల చిత్రాలు సృష్టించి బెదిరిస్తున్నారు. నాలుగు రోజుల…
ఖర్చులకు డబ్బులు కావాలా..ఇంట్లో స్నేహితులను అడిగితే డబ్బులు ఇవ్వడం లేదా..లేకపోతే ఎవరినైనా చేబదులు అడగాలంటే సిగ్గుగా అనిపిస్తుందా? బ్యాంకుల చూట్టు తిరిగే ఓపిక లేదా? డోంట్ వర్రీ ఇకపై మీకు ఆ ఇబ్బంది లేదు….ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే సెకన్లలో ఆన్ లైన్ లో మీ ఎకౌంట్ కు డబ్బులిచ్చేస్తాం అంటున్నారు ఆన్ లైన్ పర్సనల్ లోన్ యాప్ నిర్వాహకులు. ఇదేదో ప్రజాసేవ కాదు….మధ్యతరగతి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని పీక్కుతినే మైక్రోఫైనాన్స్ లాంటి దిక్కుమాలిన ఆన్…