Hyderabad Cybercrime Police: హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌లు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపింది. పోలీసుల ప్రకటనల ప్రకారం.. మోసగాళ్లు సోషల్ మీడియా, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు ద్వారా అత్యధిక లాభాలు లేదా గ్యారంటీ ప్రాఫిట్లు ఇస్తామని చెప్పి బాధితులను ఆకర్షిస్తున్నారు. ఈ మోసగాళ్లు నకిలీ వెబ్సైట్లు, ట్రేడింగ్ డాష్బోర్డులు, యాప్లు వాడి నకిలీ లాభాలు చూపిస్తూ మరిన్ని పెట్టుబడులు పెట్టమని ప్రలోభపెడతారు.
Cyber Crime Alert: రాష్ట్రంలోని సైబర్ క్రైమ్ యూనిట్.. ప్రజలను “డిజిటల్ అరెస్ట్” స్కామ్‌ల గురించి హెచ్చరిస్తూ అడ్వైజరీ జారీ చేసింది. ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ స్కామ్‌లలో మోసగాళ్లు పోలీస్, సీబీఐ, కస్టమ్స్, ఈడీ, TRAI, DOT, NIA, ATS లేదా కరియర్ సిబ్బంది పాత్రను పోషించి, బాధితులు సీరియస్ క్రైమ్స్ లో ఉన్నారని చెప్పడం.. బాధితులను మనీ లాండరింగ్, ట్రాఫికింగ్, నార్కోటిక్స్ లేదా టెర్రరిజం వంటి…