ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుకు ఆనుకుని ఉన్న చిత్రగుప్త దేవాలయం గోడ కూలిపోయింది. ఈ సమయంలో అక్కడ రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్న కార్మికులపై పడింది. దీంతో.. నలుగురు కూలీలపై శిథిలాలు పడ్డాయి. భారీ శబ్దం రావడంతో.. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని శిథిలాల నుండి కూలీలను బయటకు తీసి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఓ కూలీ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
వినాయక నిమజ్జనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శోభాయాత్రలో ఆడిపాడుతున్నారు. ఇంతలో అనుకోని సంఘటన జరిగింది. గణేష్ శోభాయాత్ర వాహనంలో ఉంచిన బాణాసంచా ఒక్కసారిగా పేలింది. ఏం జరిగిందో అర్థమయ్యే లోపు డ్యాన్స్ చేస్తున్న వారు గాయాలతో పడి ఉన్నారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ఊడిముడి వద్ద పడవ ప్రమాదం జరిగింది. వరద ప్రభావిత లంక గ్రామాలకు పడవలో వాటర్ ప్యాకెట్లు తీసుకెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో పడవలో ఆరుగురు ప్రయాణిస్తుండగా వరద ప్రవాహానికి పడవ బోల్తా పడింది. అందులో ఉన్న ఐదుగురిని స్థానిక మత్స్యకారులు నాటు పడవలో వెళ్లి రక్షించగా.. ఒకరు గల్లంతు అయ్యారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పూణెలోని లావాసా నగరంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మూడు ఇళ్లు కూలిపోయాయి. అంతేకాకుండా.. ఓ యువకుడు మృతి చెందాడు. కాగా కొండచరియలు విరిగిపడిన శిథిలాల కింద ఇద్దరు చిక్కుకున్నారు. వర్షం కారణంగా పూణె, థానేలో వరదలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. డ్యామ్‌లలో నీటిమట్టం పెరిగింది. వర్షం కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో.. ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ప్రజలను రక్షించే పనిలో…
ఈశాన్య ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై సిరా విసిరిన నిందితుడు అజయ్‌కుమార్ (41)ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు నార్త్ ఈస్ట్ డీసీపీ జాయ్ టిర్కీ సమాచారం అందించారు. కాగా.. మే 17న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో కన్హయ్య కుమార్‌పై ఇంక్ విసిరి, చెంపదెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. కొందరు వ్యక్తులు కన్హయ్యకు పూలమాల వేస్తానన్న సాకుతో వచ్చి చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో తమ పేర్లను స్థానిక ఆలయ పండుగ కరపత్రంలో ప్రచురించకపోవడంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో 80 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని వస్త్రాపూర్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఒక వర్గం మరో వర్గంపై కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
మనం ఒక్క సిమ్ కార్డు తీసుకునేందుకు నానా తిప్పలు పడుతుంటే ఓ వ్యక్తి ఏకంగా వందల సంఖ్యలో సిమ్ కార్డ్స్ తీసుకుని వాడుతున్నాడు. ఎక్కడో కాదండోయ్ మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది.