Special Story on Vinayaka Nimajjanam: మన దేశంలో ఇన్ని రోజులు ఇంత మంది జనం కలిసిమెలిసి చేసుకునే పండుగ వినాయకచవితి తప్ప మరొకటి లేదేమో. గణేషుడి పుట్టిన రోజున ఘనంగా మొదలయ్యే ఈ నవరాత్రి ఉత్సవాలు నిరాటంకంగా భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య సాగాయి. బొజ్జగణపయ్య బొమ్మలను పూజల కోసం కొలువు దీర్చిన పవిత్రమైన క్షణం నుంచి గంగమ్మ ఒడిలోకి చేర్చే గడియ వరకు ప్రతి రోజూ ప్రతిఒక్కరూ ఈ వేడుకల్లో ఆద్యంతం పాల్గొన్నారు.