Youth Awardees Meet President: ఒక దేశం ఒకే ఎన్నిక అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ చర్చలు చేస్తోంది. అయితే ఎన్నికల అంశంపై యువతలో అవగాహన పెంచేందుకు దేశవ్యాప్తంగా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక దేశం – ఒకే ఎన్నిక కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు యువకులు. రాష్ట్రపతిని కావలసిన వాళ్లలో ఆంధ్రప్రదేశ్ యువజన అవార్డ్ గ్రహీత బిసాతి భరత్ కూడా ఉన్నారు. ఒకే దేశం – ఒకే ఎన్నిక అనే గొప్ప ఎన్నికల సంస్కరణను అమలు చేయాలని యువ నేతలంతా రాష్ట్రపతికి ద్రౌపదీ ముర్ముకు వినతిపత్రం అందజేశారు.
READ MORE: MLC Kavitha: రేపు ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌కు కవిత.. ఎందుకో తెలుసా..?
సంవిధాన్ సపోర్ట్ ఆధ్వర్యంలో..
2024 ఆగస్టులో ఏర్పాటైన సంవిధాన్ సపోర్ట్ అనే యువజన ప్రెజర్ గ్రూప్ ఆధ్వర్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టారు. జాతీయ యువజన పురస్కార గ్రహీతలు, ఎన్‌ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీతలు కలిసి ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. సంవిధాన్ సపోర్ట్ ఉద్యమంలో మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 340 మంది లోక్‌సభ , రాజ్యసభ సభ్యులను కలిశారు. పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ నాయకులకు వినతిపత్రాలు అందజేసి, ఒక దేశం ఒక ఎన్నికల అవసరాన్ని వివరించారు. రెండవ దశలో దేశవ్యాప్తంగా 15 లక్షల యువతతో సంతకాలు సేకరించారు. ఆ తర్వాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ నుంచి భారత పార్లమెంటు వరకు శాంతియుత ర్యాలీ, జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ఇవన్నీ “ఒకే దేశం – ఒకే ఎన్నిక” కోసం యువత చూపిన పట్టుదలకు నిదర్శనాలు. మూడవ దశలో 112 మంది జాతీయ యువజన పురస్కార గ్రహీతలు, ఎన్‌ఎస్ఎస్ అవార్డు గ్రహీతలు, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి యువత చేసిన సంతకాలతో కూడిన వినతిపత్రాలు సమర్పించారు.
ఎన్నికల సంస్కరణ అమలుతో పాలనా వ్యవస్థలో స్థిరత్వం, ఎన్నికల ఖర్చుల తగ్గింపు, ఓటర్ల అలసత్వం నివారణ, రాజకీయ నాయకుల ప్రచార సమయం తగ్గింపు జరుగుతాయి. ఇది దేశ ఆర్ధిక అభివృద్ధికి, పరిపాలన మెరుగుదలకూ, ప్రజలకు అందే సేవలకు తోడ్పడుతుందని యువజన అవార్డు గ్రహీతలు చెప్తున్నారు.
READ MORE: Hydra: సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు.. క్లారిటీ ఇచ్చిన హైడ్రా…