దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నా ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కేసులు ఇప్పటి వరకు అదుపులోకి రాలేదు. తాజాగా ఢిల్లీలో 28,867 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో 31 మంది మృతి చెందారు. 24 గంటల్లో కరోనా నుంచి 22,121 మంది కోలుకున్నట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 94,160 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 29.21శాతంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. భారీ స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇకపోతే, దక్షిణాదికి చెందిన కర్ణాటకలోనూ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.
Read: రికార్డ్: ఆమెను 30 కోట్లమంది ఫాలో అవుతున్నారు…
తాజాగా 25,005 కరోనా కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్‌లోనూ కర్ణాటకలో భారీగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు. కరోనా నుంచి 24 గంటల్లో 2363 మంది కోలుకున్నారని కర్ణాటక ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కర్ణాటకలో ప్రస్తుతం 1,15,733 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. యాక్టీవ్ కేసులు లక్షదాటిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు.