ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రముఖ వైరాలజిస్ట్ టి జాకబ్ జాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ దారితప్పి పుట్టిన ఓ వేరియంట్ అని అన్నారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్‌కు వూహన్‌లో పుట్టిన డి614 జీ వేరియంట్ కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని, ఒమిక్రాన్‌కు డి 614 జీ వేరియంట్ ముత్తాత వంటిదని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తంమీద రెండు రకాల వేరియంట్లు ఉన్నాయని అన్నారు. అందులో ఒకటి పాత వూహాన్ వేరియంట్ దాని ఉత్పరివర్తనాలు కాగా, రెండోది ఒమిక్రాన్ వేరియంట్ అని వైరాలజిస్ట్ పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ తో కూడిన మహమ్మారి న్యూమోనియా, హైపోక్సియా, శరీరంలో అవయవాలు విఫలం కావడానికి కారణమైతే, రెండోదైన ఒమిక్రాన్ శ్వాసకోశ వ్యాధిని మాత్రమే కలిగిస్తోందని అన్నారు. అయితే, ఒమిక్రాన్ తరువాత వచ్చే వేరియంట్లు ఎంత వరకు హానికరంగా ఉంటాయి అనే దానిపై ఇప్పట్లోనే చెప్పలేమని అన్నారు.
Read: సండే లాక్‌డౌన్ సత్ఫలితాలు ఇస్తుందా?