భారత అథ్లెట్లు మైరాజ్ అహ్మద్ ఖాన్ మరియు అంగద్ వీర్ సింగ్ బజ్వా ఇద్దరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి ఒక్క దేశం నుండి మరో దేశం వెళ్లారు. అయితే ప్రస్తుతం ఇటలీలో శిక్షణ తీసుకుంటున్న ఈ ఇద్దరు భారత షూటర్లు 2021 టోక్యో ఒలంపిక్స్ ను ఎంపికయ్యారు. కానీ అందుకోసం టోక్యో వెళ్లాలంటే తప్పకుండ వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. అయితే వీరు ఇప్పుడు శిక్షణ తీసుకుంటున్న ఇటలీలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుండి 1000 కిలోమీటర్లు కారులో ప్రయాణించి క్రొయేషియాకు వెళ్లి అక్కడ వ్యాక్సిన్ తీసుకున్నారు.