ప్రస్తుతం ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్ర చేసిన ఇంగ్లండ్ యువ పేసర్ ఓలీ రాబిన్‌సన్ వివాదాల్లో చిక్కుకున్నాడు. మొదటి మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసిన ఈ యువ పేసర్ గతంలో సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్స్ వివాదం రేపాయి. 2012 నుంచి 2014 మధ్యలో ట్విటర్‌లో స్త్రీ వివక్ష, జాత్యాంహంకార సందేశాలు పోస్ట్ చేశాడు…