Olive Ridley turtles: తూర్పు తీరం తాబేళ్ల మృత్యుకుహరంలా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సముద్ర తాబేళ్లు డిసెంబరు ఏప్రిల్ మధ్య గుడ్లు పెట్టేందుకు హిందూ మహాసముద్రంలోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ జలాల నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల వైపు వస్తుంటాయి. ఇక్కడి ఇసుక తిన్నెల్లో ప్రాణం పోసుకున్న బుల్లి తాబేళ్లు, అటుపోట్ల సమయంలో సముద్రంలోకి జారుకొని జీవనం సాగిస్తాయి.