అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నారు పెద్దలు. అదే తీరున నాటి మేటి నటి మీనాకుమారి, ఆమె భర్త కమల్ ఆమ్రోహి తమ పాకీజా చిత్రం గురించి ఎన్నెన్నో అనుకున్నారు. అయితే ఆ సినిమా ఏ ముహూర్తాన మొదలయ్యిందో కానీ, పలు బాలారిష్టాలు ఎదుర్కొని చివరకు 1972 ఫిబ్రవరి 4న జనం ముందు నిలచింది. 1956లో షూటింగ్ మొదలు పెట్టుకున్న పాకీజా దాదాపు 16 ఏళ్ళ తరువాత ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా విడుదలైన…