CS Shanti Kumari: ఈ నెల 28న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు.
ఏలేరు వరద ముంపుపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను కోరారు. రైతులకు భరోసా కల్పించండి.. వైద్య సేవలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని తెలిపారు. ఏలేరు వరద ముంపు ప్రభావితమైన 21 మండలాల్లోని 152 గ్రామాల్లో సహాయక చర్యలను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువలకు విడుదల చేస్తున్నారు అధికారులు.
ఏలేరు వరదపై డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఏలేరు రిజర్వాయర్కి జల ప్రవాహం పెరుగుతుండటం, వర్షాల మూలంగా వరద ముప్పు పొంచి ఉండటంతో.. ముందస్తు జాగ్రత్తలు, ముంపు ప్రభావిత గ్రామాల పరిస్థితిపై పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో సమీక్షించారు.
ఈరోజు మధ్యాహ్నం నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన వర్షం భారీ ఎత్తున కురుస్తుండతో ఆందోళన మొదలైంది. ఎగువన కూడా బయ్యారం, గార్ల, మహబూబాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మున్నేరుకి వరద వస్తుంది. దీంతో.. మున్నేరు ముంపు బాధితులను మళ్లీ పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. కృష్ణా నది వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో.. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ప్రభావిత ప్రాంత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
సీజనల్ వ్యాధుల కట్టడి పై సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిపై అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసుల కట్టడిపై ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశం ఇచ్చారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాదులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను కూడా క్షేత్రస్థాయిలో చివరి వ్యక్తికి అందేలాగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అధికారులకు సూచించారు. పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న వారికే కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అట్టడుగు వర్గాల వారికి కూడా సంక్షేమ పథకాలు అందేలాగా చూడాలని గవర్నర్ సూచించారు.
ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వస్తున్న వరద నీటిని వినియోగించుకుని రాష్ట్రంలోని అన్ని ప్రధాన రిజర్వాయర్లు, మైనర్ ఇరిగేషన్ చెరువులను పూర్తిగా నీటితో నింపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జల వనరులు శాఖ అధికారులను ఆదేశించారు.