WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WTC Points Table: న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల తర్వాత టెస్టు సిరీస్‌లోనూ భారత జట్టుకు ఆశించిన ఫలితం దక్కలేదు. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత్, న్యూజిలాండ్ జట్లకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ చివరి రోజు కివీస్ బ్యాటర్లు అడ్డుగోడలా నిలవడంతో టీమిండియాకు నిరాశ తప్పలేదు. ఫలితంగా న్యూజిలాండ్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. భారత్ నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ పాయింట్ల శాతాన్ని కోల్పోయింది.
తాజా WTC పాయింట్ల పట్టిక ప్రకారం న్యూజిలాండ్ ఖాతాలో 66.67% పాయింట్లు ఉన్నాయి. దీంతో ఆ జట్టు రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా రెండో స్థానానికి చేరుకోగా, డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు 50% పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో భారత్ WTC ఫైనల్ అవకాశాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Also Read
- Vishnu Kumar Raju: విశాఖలో బీజేపీ అసంతృప్తి.. డిప్యూటీ మేయర్ పదవిపై విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు
- Gold and Silver Prices: వరుస పతనానికి బ్రేక్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?
- Houthis Attack Saudi Arabia: సౌదీ అరేబియాపై హూతీల దాడి.. చమురు శుద్ధి కర్మాగారమే టార్గెట్..!
- Bisleri Water: మీరు తాగే బిస్లరీ వాటర్ సురక్షితమేనా? షాకింగ్ విషయాలు వెల్లడించిన FSSAI..
టీమిండియాకు మరో ఆందోళనకర విషయం ఏమిటంటే.. 11 ఏళ్ల తర్వాత వరుసగా రెండు టెస్టు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. వెల్లింగ్టన్ టెస్టుకు ముందు శ్రీలంక పర్యటనలో చివరి టెస్టు కూడా డ్రాగా ముగిసింది. ప్రస్తుత WTC సైకిల్లో భారత్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. దీనివల్ల పాయింట్ల శాతంపై ప్రభావం పడుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులు చేసింది. ఒక దశలో 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్‌ను హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ ఆదుకున్నారు. వీరిద్దరూ భారీ భాగస్వామ్యంతో జట్టును నిలబెట్టారు. నికోల్స్ 175 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, ఫిలిప్స్ 118 పరుగులు చేశాడు.

అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 720 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్ 136 పరుగులతో సెంచరీ సాధించగా, రిషభ్ పంత్ 128 పరుగులతో చెలరేగాడు. వీరితో పాటు యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్ అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో భారత్‌కు 352 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను త్వరగా ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ విజయాన్ని అందుకోవాలని భారత్ భావించింది. అయితే ఐదో రోజు తొలి సెషన్లో డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారు. ఆ తర్వాత డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ క్రీజులో పాతుకుపోయారు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వికెట్లను కాపాడుకుంటూ బ్యాటింగ్ చేశారు. దీంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఒక దశలో భారత్ విజయం ఖాయమనిపించిన ఈ మ్యాచ్ చివరకు డ్రాగా ముగియడంతో ఇరు జట్లకు WTC పాయింట్ల పట్టికలో నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఫైనల్ బెర్తుపై ఆశలు పెట్టుకున్న టీమిండియాకు ఈ ఫలితం నిరాశ కలిగించింది.
తాజావార్తలు
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Explainer: మేనరికాలతో పిల్లలకు శాపం! దక్షిణాది మారేది ఎప్పుడు?
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
Vishnu Kumar Raju: విశాఖలో బీజేపీ అసంతృప్తి.. డిప్యూటీ మేయర్ పదవిపై విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు
-
IND vs NZ: డ్రాగా ముగిసిన తొలి టెస్టు.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ!
ట్రెండింగ్
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!