Tirumala Vaikunta Dwara Darshan 2026: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Vaikunta Dwara Darshan 2026: వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రత్యేక స్థానం ఉంది.. అయితే, తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. డిసెంబర్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనుంది. ఇందుకు సంబంధించిన దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆన్లైన్ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లను విడుదల చేయనుంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో భక్తులకు దర్శన సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
ఎల్లుండి నుంచి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఎల్లుండి నుంచి ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. డిసెంబర్ 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రోజుకు 15 వేల చొప్పున మొత్తం లక్షా 20 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. భక్తులు నిర్ణీత తేదీల్లో ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read
26న శ్రీవాణి దర్శన టికెట్ల విడుదల
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకోవాలనుకునే భక్తుల కోసం డిసెంబర్ 26వ తేదీన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. డిసెంబర్ 22 నుంచి 29వ తేదీ వరకు రోజుకు 1,500 చొప్పున టికెట్లు అందుబాటులో ఉంచనుంది. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో శ్రీవాణి టికెట్లు పొందాలనుకునే భక్తులు ఈ తేదీని గుర్తుంచుకోవాలి.
సర్వదర్శనం భక్తులకు రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి?
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు లేని సర్వదర్శనం భక్తుల కోసం కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు సర్వదర్శనం భక్తులకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు నిర్వహించనుంది. అనంతరం డిసెంబర్ 4వ తేదీన ఎలక్ట్రానిక్ డిప్ (ఈ-డిప్) విధానం ద్వారా దర్శన టోకెన్లను కేటాయించనుంది.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి లక్షలాది టోకెన్లు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులకు దర్శన అవకాశం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండు ముఖ్యమైన రోజులకు సంబంధించి మొత్తం లక్షా 59 వేల దర్శన టోకెన్లను కేటాయించనుంది. భక్తులు టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలను గమనించి ముందుగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచిస్తోంది.
మొత్తంగా డిసెంబర్ 20 నుంచి 29 వరకు పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులు టీటీడీ ప్రకటించిన షెడ్యూల్‌ను గమనించి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.. కాగా, వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుమలకు పెద్ద ఎత్తున భక్తుల తరలి వస్తున్న నేపథ్యంలో.. గత కొన్ని సంవత్సరాలుగా.. వైకుంఠ ద్వారా దర్శనాల సమయాన్ని టీటీడీ పెంచిన విషయం విదితమే..
తాజావార్తలు
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Tirumala Vaikunta Dwara Darshan 2026: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Explainer: మేనరికాలతో పిల్లలకు శాపం! దక్షిణాది మారేది ఎప్పుడు?
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
Vishnu Kumar Raju: విశాఖలో బీజేపీ అసంతృప్తి.. డిప్యూటీ మేయర్ పదవిపై విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!