Off The Record: ఒకే పార్టీకి రెండు ఆఫీసులా..? అక్కడ బీజేపీలో పీక్స్‌కు చేరిన గ్రూప్ వార్..!
- నర్సాపూర్ నియోజకవర్గంలో బీజేపీకి రెండు కేంద్రాలు..
- జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్ వర్సెస్ లోకల్ లీడర్ మురళి యాదవ్..
- మల్లేష్గౌడ్కు జిల్లా పదవిపై మురళి వ్యతిరేకత..
- పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు హాజరవని మురళి..
- ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరికి కోపమోనని కేడర్ టెన్షన్..
- ఇప్పటికే నర్సాపూర్‌లో పార్టీ కార్యాలయం..
- కొత్తగా మున్సిపల్ బీజేపీ పేరుతో మురళి యాదవ్ ఆఫీస్..
- గతంలో బీజేపీలో పని చేసిన ఇద్దరు నాయకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: మెదక్ జిల్లాలో బీజేపీ పరిస్థితి రెండు నియోజకవర్గాలు, పది గ్రూపులు అన్నట్టు తయారయింది. నిత్యం వర్గపోరుతో పార్టీ సతమతమవుతోంది. గత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ఏ మాత్రం ఆశాజనకమైన ఫలితాలు రాలేదు.మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తుప్రాన్ మున్సిపాలిటీల్లో డిలా పడగా… నర్సాపూర్‌లో హంగ్ ఏర్పడటంతో కింగ్ మేకర్ అవగలిగింది. విచిత్రంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చిన బీజేపీ… ఇక్కడ వైస్ చైర్మన్ పదవి దక్కంచుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఊరటనిచ్చిన అంశం బహుశా జిల్లాలో ఇదొక్కటేనని అంటారు. ఇక మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన వాల్దాస్ మల్లేష్ గౌడ్‌ని అధిష్టానం నియమించింది. అంతకు ముందున్న జిల్లా అధ్యక్షుడితో పార్టీకి పెద్ద ప్రయోజనం చేకూరలేదన్న అభిప్రాయం ఉంది. అందుకే మార్చి మల్లేష్ గౌడ్‌ని నియమించింది. ఆయన పార్టీ బలోపేతం కోసం పనిచేస్తారనుకుంటే…. వచ్చినప్పటి నుంచి వర్గపోరు, గ్రూప్ తగాదాలు తగ్గకుండా అలాగే కంటిన్యూ అవుతున్నాయంటున్నారు.
అలాగే… మల్లేష్ గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ నేత మురళి యాదవ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట. మల్లేష్గౌడ్కి జిల్లా అధ్యక్ష పదవి వచ్చినప్పుడు మురళి యాదవ్ వ్యతిరేకించారు. మల్లేష్‌తో కలిసి పనిచేయడం ఆయనకు ఇష్టం లేదన్న ప్రచారం నియోజకవర్గంలో ఉంది. అందుకే… పార్టీ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమానికీ మురళి యాదవ్ హాజరవడంలేదని చెప్పుకుంటున్నారు. ఇటు జిల్లా అధ్యక్షుడిగా… మల్లేష్ గౌడ్ కూడా మురళి యాదవ్‌ని కలుపుకుని పోయే ప్రయత్నం చేయట్లేదట. వచ్చినోళ్లు మనవాళ్లు, రానివాళ్లు పరాయివాళ్లు అన్నట్టు ఆయన వ్యవహరిస్తున్నారన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. ఇదే సమయంలో… నియోజకవర్గంలో పార్టీ కేడర్‌కి కొత్త టెన్షన్ పట్టుకుందంట. ఏమైనా ప్రోగ్రాం పెడితే… ఒక నాయకుడి దగ్గరకు వెళ్తే ఇంకొకరికి టార్గెట్ అవుతామన్న భయంతో… కొందరైతే అసలు పార్టీ కార్యక్రమాలకు రావడమే మానేశారట. మరోవైపు ఈ కోల్డ్‌వార్ ముదిరి నర్సాపూర్‌లో ఒకే పార్టీకి రెండు ఆఫీస్‌లు ఓపెన్ చేసే వరకు వెళ్లింది. నియోజకవర్గ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్ నిర్వహిస్తుంటే…. అందులో అడుగు పెట్టడం ఇష్టంలేని మురళి యాదవ్ తాజాగా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్యాలయం పేరుతో నర్సాపూర్‌లోనే మరొకటి ఓపెన్ చేశారు.
Also Read
దీంతో పార్టీ కేడర్‌లో గందరగోళం ఇంకా పెరిగిపోయిందట.ఓకే పార్టీకి ఒకే నియోజకవర్గంలో రెండు ఆఫీస్‌లు ఎందుకంటూ సొంత నేతలే ముక్కున వేలుసుకుంటున్నారట. పార్టీ ప్రయోజనాలను పక్కకు పెట్టి ఈ ఇద్దరు నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడుతూ….నష్టం చేస్తున్నారని క్యాడర్ కూడా గుర్రుగా ఉందంటున్నారు. అందర్నీ కలుపుకుని పోవాల్సిన జిల్లా అధ్యక్షుడి మురళి యాదవ్ ఈ విషయంలో పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం పార్టీకి నష్టమని కొందరు అంటుంటే..మరి కొందరు మల్లేష్ గౌడ్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే పార్టీ కార్యక్రమాలను రెగ్యులర్‌గా నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక్కడ విచిత్రమేంటంటే వీళ్ళిద్దరూ గతంలో బీఆర్ఎస్లో పనిచేసిన వారే. దాదాపుగా ఇలాంటి వాతావరణమే మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం ఉందని అంటున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా…. ఓకే పార్టీకి ఒకే ఊళ్ళో రెండు కార్యాలయాలు ఉండటం మాత్రం చర్చకు దారితీస్తోంది.
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!