OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి తూర్పు గోదావరి వైసీపీలో కొత్త టెన్షన్ మొదలైందా? బాబ్బాబు…. ఈ ఒక్కసారికి మా మాట వినండ్రా… మీకు పుణ్యం ఉంటుందంటూ నియోజకవర్గ సమన్వయ కర్తలు లోకల్ లీడర్స్‌ని బతిమాలుకుంటున్నారా? జింకా…? బంకా….? జీఎమ్మా…? ఏజీఎమ్మా…? మీకేం కావాలో చెప్పండంటూ సినిమా డైలాగ్‌ని గుర్తు చేస్తున్నారా? అయినా సరే… డోంట్ కేర్, ఫో… ఫోండయ్యా అని స్థానిక నాయకులు ఎందుకు అంటున్నారు? అసలక్కడ ఏం జరుగుతోంది?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది. వైసీపీ ఒక్కటంటే ఒక్క సీట్లో కూడా గెలవకపోవడంతో.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏంటన్న చర్చలు ఆ పార్టీ వర్గాల్లో హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఏకగ్రీవాలు ఉండకూడదన్న ఫ్యాన్ అధిష్టానం ఆదేశాలకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు అస్సలు పొంతన లేకపోవడమే ఇప్పుడు మెయిన్ టాపిక్. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మొత్తం 61 జడ్పీటీసీలకుగాను 58 చోట్ల ఫ్యాన్ హై స్పీడ్‌లో తిరిగింది. పది మున్సిపాలిటీల్లోని 268 వార్డులకుగాను 218 చోట్ల విన్ అయింది. మెజార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. రాజమండ్రి, కాకినాడ కార్పొరేషన్లకు అప్పుడు ఎన్నికలు జరగలేదు. అయితే… అదంతా గతం. ఇప్పుడు ముఖ చిత్రం మారిపోయింది.
Also Read
పొలిటికల్ సిచ్యుయేషన్ పూర్తిగా తిరగబడిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు వీలైనన్ని ఏకగ్రీవాలకు గట్టిగా ప్రయత్నించిన వైసీపీ నాయకులకు ఆ పార్టీ అధిష్టానం ఇటీవల గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఏకగ్రీవాలు ఎక్కువ జరిగిన నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు రేపు ఎమ్మెల్యే టిక్కెట్ మర్చిపోవాలంటూ పార్టీ అధ్యక్షుడు జగన్ గట్టి వార్నింగే ఇచ్చారు. దీంతో… ఉమ్మడి తూర్పు గోదావరిలో ప్రస్తుత క్షేత్ర స్థాయి పరిస్థితులను తల్చుకుని కుదురుగా ఉండలేకపోతున్నారట వైసీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు. పార్టీ అధిష్టానం నుంచి అంత స్పష్టమైన ఆదేశాలు రావడంతో లోకల్ బాడీస్ ఎన్నికలు పెద్ద టాస్క్ అయ్యాయని అంటున్నారు. వాళ్ళు చెప్పడం బాగానే ఉందిగానీ… గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు వేరేగా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
లోకల్ ఎన్నికల్లో కూటమిలోని మూడు పార్టీలను ఢీ కొట్టి బరిలో ఉండటమంటే అంత ఈజీ కాదని అంటున్నారట వైసీపీ స్థానిక నేతలు. అధికారంలో ఉన్నవాళ్ళు ఎంత బలంగా ఉంటారో పార్టీ పెద్దలకు తెలియదా అని పెదవి విరిచే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఏకగ్రీవం అయితే అక్కడ నియోజకవర్గ కో ఆర్డినేటర్లను మారుస్తానని జగన్ స్పష్టంగా చెప్పారు. ఇక ప్రస్తుతానికి నియోజకవర్గ స్థాయిలో పదవులు పొందిన లోకల్ లీడర్స్‌కు పార్టీ కో ఆర్డినేటర్లు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నారు. అదే సమయంలో ఎవరు ఎక్కడ పోటీ చేయాలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. కానీ… స్థానిక నాయకులు… ఏ మాత్రం తడుముకోకుండా… పోటీ చేయడం మావల్ల కాదని కుండ బద్దలు కొట్టేస్తున్నట్టు సమాచారం. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు పోటీ చేసి మాత్రం ఏం ప్రయోజనం అంటూ రివర్స్‌లో ప్రశ్నిస్తున్నారట. ఆర్థికంగా మేం చూసుకుంటామని కో ఆర్డినేటర్స్ చెప్పినా….అదంతా అయ్యే పని కాదని ముఖం మీదే అంటున్నట్టు సమాచారం.
చాలా పెద్ద డ్యామేజ్ అవుతుందని, మీరే ఆలోచించండంటూ… రిక్వెస్ట్ చేసే వాళ్ళు సైతం పెరుగుతున్నారు. పోటీ చేసి ఓడిపోతే… ఊళ్ళలో తమ పరువు పోతుందని, అలాంటప్పుడు అసలు ఆ జోలికి వెళ్ళకపోవడమే మంచిది కదా అని సమన్వయకర్తలకు నచ్చచెప్పే ప్రయత్నం కూడా జరుగుతోందంటున్నారు. కావాలంటే మీరు ఎవరో ఒకరిని పెట్టి కథ నడిపించండిగానీ…
ఇప్పుడు పోటీలు, పోరాటాలంటే మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో జిల్లాలో వైసిపి కో ఆర్డినేటర్లు ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. గెలుపు సంగతి తర్వాత, ముందు వీళ్ళని కన్విన్స్ చేసి బరిలో దింపగలిగితే చాలన్నట్టు ఉందట వ్యవహారం. ఈ పరిస్థితుల్లో… ప్రస్తుతం జిల్లా పార్టీ ముఖ్యనాయకులు ఏ ఇద్దరు కలిసినా… మీ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది? సెట్ అయిందా అంటూ పరస్పరం ప్రశ్నించుకుంటున్నారట. పార్టీ ఇచ్చిన టార్గెట్ చాలా కష్టంగా ఉందంటూ తమలో తామే చర్చించుకుంటున్నట్టు తెలిసింది. అదే సమయంలో అధికారం ఉన్నప్పుడు పదవులు అనుభవించారు, మరి ప్రతిపక్షంలో ఆ మాత్రం పర్ఫామెన్స్ చేయలేరా అని సెటైర్లు వేసే వాళ్ళు కూడా ఉన్నారట. మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరిలో ఫ్యాన్ పార్టీ లీడర్లకు లోకల్ టెన్షన్ పట్టుకుంది. స్థానిక నాయకులు పోటీకి ఆసక్తి చూపడం లేదంటూ తెగ ఇదైపోతున్నారు. అదే సమయంలో గ్రామ, మండల స్థాయి నాయకులు మాత్రం…అనువుగాని చోట పద్యాన్ని గుర్తు చేసుకుంటున్నారట. ఈ పరిస్థితుల్లో… ఫైనల్‌గా ఏం జరుగుతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది.
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!