OTR: రాజానగరం టీడీపీలో విచిత్రమైన పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారంలో ఉన్న టీడీపీని కాదని అక్కడి పార్టీ కార్యకర్తలు, కొందరు నాయకులు వైసీపీలోకి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పటికే కొందరు విపక్షం బాట పట్టగా మరి కొందరు కూడా క్యూలో ఉన్నారా? స్థానిక ఎన్నికల ముంగిట్లో ఇదేంగోలంటూ టీడీపీ లీడర్స్ తల పట్టుకుంటోంది ఎక్కడ? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి?
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం టిడిపి ఇన్చార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రస్తుతం మూడు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా, తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, అలాగే రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్. అయితే…. ఈ మూడు పడవల ప్రయాణంలో…ఆయన ఏ ఒక్కదానికీ పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారన్న విమర్శలు టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. రుడా పరిధిలో లే అవుట్లు, అపార్ట్‌మెంట్స్‌కు అనుమతుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, అధికారుల చేతులు తడిపితేనే ఫైళ్లు ముందుకు కదులుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నప్పటికీ, రుడా ఛైర్మన్‌గా వెంకటరమణ చౌదరి స్పందించకపోవడంపై అనుమానాలున్నాయంటున్నాకు కొందరు. అధికారులు, సిబ్బందిపై ఆయనకు పూర్తి స్థాయి పట్టు లేకపోవడమే కారణమా..? ఇంకేమైనా ఉందా..? అన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షుడిగా కూడా బొడ్డు పనితీరు ఆశించిన స్థాయిలో లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
- OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
- OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టిడిపి నేతల మధ్య విభేదాలు పెరుగుతున్నా, కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపాలు బయటపడుతున్నా… వాటిని పరిష్కరించడానికి వెంకటరమణ చౌదరి చొరవ చూపడం లేదనే అసంతృప్తి పెరుగుతోందట. ఆయన జిల్లా అధ్యక్షుడైనా… రాజానగరం నియోజకవర్గానికే పరిమితం అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. పోనీ…. అక్కడన్నా… సవ్యంగా ఉందా అంటే… అదీ లేదంటున్నారు. ఆ వ్యవహారాలు రానురాను ఇంకా సంక్లిష్టంగా మారుతున్నాయన్నది టీడీపీ వర్గాల టాక్. ఇన్‌ఛార్జ్‌గా ఉంటూ… ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తుండటంతో…మరో వర్గం తీవ్ర అసంతృప్తికి గురై పార్టీ కార్యక్రమాలకు దూరమవుతోందని చెబుతున్నారు. ఇటీవల సీతానగరం మండలంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజీనామా చేసి వైసీపీలో చేరడమే ఇందుకు ఉదాహరణ అంటున్నారు పరిశీలకులు.
రాజానగరం, కోరుకొండ మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, కాకుంటే కొందరు ఇంకా బయటపడలేదని చెబుతున్నారు. అధికారంలో ఉండి కూడా… పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారిని కనీసం బుజ్జగించే ప్రయత్నం చేయకుండా వదిలేస్తున్నారన్న విమర్శలు కూడా బొడ్డుపై ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిడిపిలో పెరుగుతున్న ఈ అసంతృప్తి పార్టీకి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందంటున్నారు. ఒకప్పుడు టిడిపికి కంచుకోటగా భావించిన రాజానగరం నియోజకవర్గంలోనే ఇప్పుడు పార్టీ పట్టు సడలుతోందనే చర్చ జరుగుతోంది. నాయకత్వ లోపం, వర్గ రాజకీయాలు, అసంతృప్తుల్ని సెట్ చేయడంలో వైఫల్యంలాంటి వాటి కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని పార్టీ శ్రేణులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నాయి.
రాజకీయ వర్గాల్లో ఇలాంటి రకరకాల చర్చలు, విశ్లేషణలు నడుస్తుండగా….వెంకటరమణ చౌదరి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. స్థానిక ఎన్నికల ముందు రాజానగరం టిడిపిలో అసంతృప్తి సెగలు పెరగడం ఎలాంటి పరిణామాలకుదారి తీస్తుందోనన్నది కేడర్ టెన్షన్.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!