ఆ జిల్లాలో పాత రాజకీయం కొత్తగా పురుడుపోసుకుంటోందా? పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని ఆ నాయకురాలు గట్టిగా ఫిక్స్ అయ్యారా? మాజీ ముఖ్యమంత్రే ఆమె టార్గెట్ అవబోతున్నారా? అందుకే ఏళ్ళుగా జిల్లా రాజకీయాన్ని పట్టించుకోని ఆ మాజీ ఎంపీ ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారా? ఎవరా నాయకురాలు? ఏంటా ఇంట్రస్టింగ్ పొలిటికల్ డెవలప్మెంట్? ఎవ్వరూ ఊహించని విధంగా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు విజయశాంతి. ఆమె పేరు ప్రకటించేదాకా ఆ విషయం రాష్ట్ర పార్టీ…
ఏపీ కూటమిలో ఏదేదో జరిగిపోతోందా? జనసేన ఎమ్మెల్యేలు కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారా? సీక్రెట్ మీటింగ్ పెట్టుకుని మనకేంటీ ఖర్మ అంటూ… గోడు వెళ్ళబోసుకున్నారా? ఆ రహస్య సమావేశానికి ఓ మంత్రి కూడా హాజరయ్యారా? అసలు జనసేన ఎమ్మెల్యేల ఆవేదన ఏంటి? వాళ్ళు సీక్రెట్‌గా సమావేశం కావాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి జట్టు గట్టిగానే కనిపిస్తున్నప్పటికీ… కొన్ని సార్లు మాత్రం ఎక్కడో… తేడా కొడుతోందన్న టాక్ నడుస్తోంది రాజకీయవర్గాల్లో. సందర్భాన్ని బట్టి మూడు పార్టీల వైఖరులు మారుతున్నాయని,…
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యవహార శైలి రాజకీయ వర్గాలకు అంతుబట్టడం లేదట. సొంత జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరిలో ప్రతిపక్ష పాత్రను బలంగా పోషిస్తున్నారాయన. కానీ... తీరా శాసనమండలికి వెళ్ళాక అధికార కూటమికి కాస్త దగ్గరగా జరుగుతున్నట్టు అనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. దీంతో త్రిమూర్తులు ఏ వైపు ఉన్నారు?
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దూకుడు, ఆయన వ్యవహార శైలి ఏకంగా సొంత హస్తం పార్టీ క్యాడర్‌నే కలవర పెడుతోందట. అంతా నా ఇష్టం.. నా మాటే శాసనం అన్నట్టుగా ఆయన పోకడ ఉందని అంటున్నారు. నేను చెప్పినట్టే అంతా నడవాలి.. నా మాటే వినాలి.. అన్నీ నేనే అన్ని సెట్ చేస్తానంటూ..
బీసీ రిజర్వేషన్స్ బిల్లు విషయమై తెలంగాణ బీజేపీ తడబడిందన్న వాదన బలపడుతోంది రాష్ట్ర రాజకీయవర్గాల్లో. దీనిపై కాస్త గట్టి చర్చే జరుగుతోందట. ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంపై అభ్యంతరం చెబుతూ వస్తోంది కాషాయ దళం. తాము అధికారంలోకి వస్తే.... ఆ కోటాను ఎత్తేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈసారి కూడా ప్రతిపక్షం లేకుండానే జరిగాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరవడం మినహా... ఆ తర్వాత వైసీపీ నుంచి హాజరు లేదు. అదే సమయంలో... కూటమి ఎమ్మెల్యేలు కొంతమంది కాస్త ముందుకు వెళ్ళి.... వాళ్ళు లేకపోతేనేం.... మేమున్నాంగా.... అంటూ, ఏకంగా ప్రతిపక్ష పాత్ర పోషించేశారు. ధూళిపాళ్ళ నరేంద్ర, కూన రవికుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి..
కొలికపూడి శ్రీనివాసరావు..... ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే. స్థానికుడు కాకున్నా... ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందే టికెట్ తెచ్చుకుని కూటమి హవాలో ఫస్ట్ అటెంప్ట్‌లోనే అసెంబ్లీ మెట్లు ఎక్కేశారాయన. గత మూడు దఫాలుగా టీడీపీకి తిరువూరులో అందని ద్రాక్షగా ఉన్న విజయాన్ని తొలిసారే దక్కించుకోవడంతో... తమకు అండగా ఉంటారని ఆశపడిందట తిరువూరు టీడీపీ కేడర్.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్‌లో కులం కుంపటి పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అది కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కమ్మ వర్సెస్ కాపుగా మారడం ఆందోళనకరమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే పార్టీ పాత నాయకులు, మారి వచ్చిన వాళ్ళు అన్న లెక్కలు కూడా ఉన్నాయట. చివరికి మేటర్ ముదిరి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసేదాకా వెళ్ళిందట.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం కంటే ఎక్కువగా... వలసల మీదే ఇప్పుడు వైసీపీలో చర్చ జరుగుతోందట. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక వన్ బై వన్ కీలక నేతలు సైతం బైబై చెబుతుండటం, అందుకు అధిష్టానం నుంచి కనీస స్పందన లేకపోవడం గురించి నాయకులంతా తెగ చెవులు కొరికేసుకుంటున్నట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ళ నాని, మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు లాంటి ముఖ్య నాయకులతోపాటు ఎమ్మెల్సీలు పోతుల సునీత, బల్లి కల్యాణ్ చక్రవర్తి,…
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. పదేళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. కేసీఆర్ అంటే... ఎవరికి తెలియదని, ఆయన గురించి అంత ఉపోద్ఘాతం అవసరమా అనుకుంటున్నారా? యస్... మీరనుకునేది కరెక్టేగానీ... అసలు మేటరంతా అక్కడే ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.