నంద్యాల..... ఏ సీజన్లోనూ పొలిటికల్ హీట్ తగ్గని జిల్లా ఇది. అందులోనూ.... ఇక్కడి టీడీపీలో అయితే... ఆ డోన్ కాస్త ఎక్కువగానే ఉంటుందని అంటారు. ఈ జిల్లాలో ప్రత్యర్థి పార్టీ వైసీపీతో కంటే... తెలుగుదేశంలోని గ్రూప్‌వారే ఎక్కువగా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ పోరు బహిరంగమవుతూ.... అప్పుడప్పుడూ వీధికెక్కుతూ ఉంటుంది కూడా. మరోసారి ఇదే తరహా రచ్చ మొదలై... పార్టీ పరువు రోడ్డున పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తమ్ముళ్ళు.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి తొలిసారిగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. దాదాపు 800కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. సభకు ఊహించినదానికంటే ఎక్కువ సంఖ్యలో జనం రావడంతో ఆల్ హ్యాపీస్ అనుకున్నారు కాంగ్రెస్ నాయకులు. అలా అనుకుంటుండగానే... వాళ్ళకో లోటు కనిపించిందట. నియోజకవర్గ కాంగ్రెస్‌లో కీలక నాయకురాలు ఇందిర ఈ కార్యక్రమలో ఎక్కడా ఎందుకు కనిపింలేదన్న చర్చ మొదలైంది
2014 నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజును గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు అచ్చంపేట ఓటర్లు . నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న గువ్వల.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంగబలం, అర్దబలంతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా కనుసన్నల్లో పెట్టుకుని నియోజకవర్గంలో నియంతలా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది.
బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రాజా సింగ్... ఈ మధ్య పార్టీ విషయంలో అంతకు మించి అన్నట్టు ఉంటున్నారట. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రాజా.. కొందరు రాష్ట్ర పార్టీ నాయకుల మీదే డైరెక్ట్ అటాక్ చేస్తూ... అయామ్ ఫైర్.. అయామ్ ది ఫైర్ అంటున్నారట. నన్ను పార్టీ నుంచి పంపించే కుట్ర చేస్తున్నారు, ఏం.. ఉండనీయదల్చుకోలేదా అంటూ పబ్లిక్‌గానే ప్రశ్నిస్తున్నారాయన.
ప్రత్యర్థి బలంగా ఉన్న నియోజకవర్గంలో… మరింత సమన్వయంతో పని చేయాల్సిన చోట ఆ టీడీపీ లీడర్స్ ఇద్దరూ ఇగోలకు పోతున్నారా? చివరికి నువ్వెంత అంటే… నువ్వెంత అనుకోవడమేగాక వార్నింగ్స్ ఇచ్చుకునేదాకా వెళ్లిందా? పార్టీ పెద్దలు తలంటినా…. మా దారి మాదేనన్నట్టుగా ఉన్నారా? వీళ్ళ మధ్య కేడర్ నలిగిపోతున్న పరిస్థితి ఏ నియోజకవర్గంలో ఉంది? ఎవరా ఇద్దరు నాయకులు? పులివెందుల పాలిటిక్స్‌లోకి వైఎస్ ఫ్యామిలీ ఎంటరయ్యాక మరో వ్యక్తి గెలిచిన దాఖలాలు లేవు. అలాంటి చోట మరింత సమన్వయంతో…
ఎక్కడైనా అధికార పార్టీ ఎమ్మెల్యేని ప్రతిపక్ష నేతలు ఇరుకున పెట్టడం కామన్. కానీ... అక్కడ మాత్రం స్వపక్షంలోనే విపక్ష తయారైందట. మా ఎమ్మెల్యే అలా చేస్తున్నాడు... ఇలా చేసేస్తున్నాడు. నియోజకవర్గంలో ఫలానా ఘోరం జరిగిపోతోందని అంటూ.. పార్టీ పెద్దలకు పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నారట.
ఆ నియోజకవర్గంలో వైన్స్ వ్యాపారులు వణికిపోతున్నారా? లాటరీలో షాపులు దక్కాయ్.... మనమంతా లక్కీ భాస్కర్స్ అని మురిసిపోయిన వాళ్ళకు ఇప్పుడు తత్వం బోధపడుతోందా? ఎందుకొచ్చిన యాపారంరా..
Off The Record: చిత్తం చెప్పుల మీద- భక్తి భగవంతుడి మీద అన్నట్టుగా ఉంది తెలంగాణలో కొంత మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి. జంప్ అయిన పార్టీలో ఉండలేక, పాత పార్టీలోకి తిరిగి వెళ్ళలేక కుమిలిపోతున్నారట.
Off The Record: వాళ్ళిద్దరూ అధికార పార్టీ లీడర్స్. పైగా గతంలో ముఖ్యమైన పదవులు నిర్వహించినవారే. కానీ... ఇప్పుడు పవరున్న పార్టీలో ఉండి కూడా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. అవసరమైతే అధికారులను, పాలకులను నిలదీయండని జనానికి సలహా ఇస్తున్నారు.
Off The Record: తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు సక్రమంగా జరగలేదా? ట్రాన్స్ఫర్స్లో గులాబీ ముద్ర కనిపించిందన్నది నిజమేనా? ఎందుకు అలాంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి? అసలు ఐపీఎస్ ట్రాన్స్ఫర్స్లో ఏం జరిగింది..