హైలెట్ అవ్వాలంటే హడావిడి చేయాలన్నదే ఆ ఎమ్మెల్యే ఫిలాసఫీనా? అధినేత దృష్టిలో పడి పదవి పొందాలనుకుంటున్నారా? అందరి కంటే ముందుండాలని అనుకున్నారా? తాజా రచ్చ వెనక కారణం అదేనా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? జోగి రమేష్ దూకుడు వెనక కారణం వేరే ఉందా? మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. సీఎంను పట్టుకుని అంత మాట అంటావా అని ఏకంగా చంద్రబాబు ఇంటి దగ్గర రభస చేశారు…
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పీసీసీతోపాటు కేడర్ కూడా క్షేత్రస్థాయిలో గురి పెట్టిందా? అందుకే సడెన్గా ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలకు భద్రత పెంచారా? కేసులు పెడుతున్నా.. కాంగ్రెస్ కేడర్ ఎందుకు దూకుడుగా వెళ్తోంది? ఈ వైఖరి ఖమ్మం జిల్లా కాంగ్రెస్కు వర్కవుట్ అవుతుందా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ కేడర్ గురి..! ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా కాంగ్రెస్ గేర్ మార్చి దూకుడు పెంచింది. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగా.. కాంగ్రెస్…
మూడు ప్రముఖ ఆలయాల ఛైర్మన్ గిరి పట్టేశారు. కానీ.. ఆనందం ఆవిరైంది. స్థానిక నినాదం వాళ్లను ఆ పదవులు చేపట్టకుండా చేసింది. స్థానికేతర నినాదం కాస్త గట్టిగానే తాకడంతో హైకమాండ్ కూడా పునరాలోచనలో పడింది. టోటల్గా పదవులు వచ్చి.. పదవులు చేపట్టని వారిగా ఆ ముగ్గురూ మిగిలిపోయారు. ఆలయాల పదవులపై స్థానిక నేతల గుర్రు! చిత్తూరు జిల్లాలో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కాక రేపుతూనే ఉంది. జిల్లాలో ముగ్గురు వైసీపీ నేతలు శ్రీకాళహస్తి, కాణిపాకం సహా కర్నూలు…
ఢిల్లీస్థాయి నాయకులు హైదరాబాద్ వస్తుంటే ఇన్నాళ్లూ బీజేపీ నాయకులు టెన్షన్ పడేవారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతల వంతు వచ్చింది. రాష్ట్రంలో టీఆర్ఎస్తో యుద్ధం చేస్తున్న సమయంలో హస్తిన నుంచి వచ్చి ప్రశంసలు కురిపించడం స్థానిక నేతలకు చిర్రెత్తికొస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్లో అలాంటి గొడవే హైకమాండ్ వరకు చేరి పెద్ద చర్చగా మారి.. రచ్చ రచ్చ అవుతోంది. శశిథరూర్ కామెంట్స్ రచ్చలో అనేక మలుపులు తెలంగాణలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి. రాష్ట్ర బీజేపీ నేతలు trsని టార్గెట్ చేస్తే..…
దేవాదాయశాఖలో ఆయనో సీనియర్ ఆఫీసర్. పదేళ్లకుపైగా సర్వీస్. రేపో మాపో పదోన్నతి దక్కుతుందన్న తరుణంలో.. చేస్తున్న కొలువుకు ఆయన ఓ దణ్ణం పెట్టేశారు. అదీ అవమాన భారం భరించలేక. ఇంతకీ ఎవరా అధికారి…!!?. ఆయన కలతకు కారణం ఏంటి…!?. ఇసుక దాడి వివాదంలో మరో ట్విస్ట్! గుర్తుందా విశాఖ దేవాదాయశాఖ కార్యాలయంలో కూర్చున్న ఓ అధికారిపై ఓ మహిళా ఉద్యోగి ఇసుక వేయడం. అదీ సీసీ కెమెరాలో రికార్డ్ కావడం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడం.. ఆ వ్యవహారం…
ఆయనో కేంద్ర మాజీ మంత్రి. 30 ఏళ్ల రాజకీయ అనుభవం. అలాంటి పెద్దాయన ‘మనసు…గాయపడింది. తాడేపేడో తేల్చేయాలని నిర్ణయించుకున్నారట. రూట్ మార్చి లేఖల యుద్ధం ప్రారంభించారు. ఇంతకీ ఆయన ‘పోరాటం’ ఫలిస్తుందా!? ఇప్పుడు రోజూ వార్తల్లో వ్యక్తి అయ్యారు! అశోక్ గజపతిరాజు. టీడీపీ సీనియర్ నేత. పార్టీలో కూడా ఆయన్ను రాజుగానే ట్రీట్ చేసేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ప్రముఖంగా కనిపించేవారు. అది కూడా అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే. కేంద్రం, రాష్ట్రంలో ఎక్కడైనా సరే…
రాజకీయాల్లో తండ్రి ఓ వెలుగు వెలిగితే.. తనయుల పొలిటికల్ భవిష్యత్కు ఢోకా ఉండదు. కానీ.. ఆ వారసుడికి మాత్రం సీన్ రివర్స్. వారసుడి గత చరిత్రను ఇప్పటికీ మర్చిపోలేకపోతోంది పార్టీ కేడర్. నేను మారిపోయాను బాబోయ్ అని.. ఆయన నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్నా విశ్వసించడం లేదట. దాంతో ఆయనకు పార్టీ ఛాన్స్ ఇస్తుందో లేదో అని చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరాయన? సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్ పదవి కోసం కోడెల శివరామ్ యత్నం! కోడెల శివరామ్. మాజీ…
తిరుమల శ్రీవారి ఆలయంలో 5 నెలలుగా నిలిచిన సర్వదర్శనం సడెన్గా ఎలా ప్రారంభమైంది? టీటీడీ ప్రయోగాత్మక పరిశీలన కూడా పూర్తికాని.. సంప్రదాయ భోజన పథకం ఎందుకు ఆగిపోయింది? ఈ రెండు నిర్ణయాల వెనక ఉన్నది ఎవరు? టీటీడీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తిరుమలలో ఆగమశాస్త్రానికే పెద్దపీట..! కలియుగ వైకుంఠనాధుడి సన్నిధిలో చిన్నపాటి మార్పులు చేయాలంటే ఎన్నో అడ్డంకులు దాటాలి. మరేన్నో వివరణలు ఇచ్చుకోవాలి. అధికారులకు నచ్చిందనో.. పాలకమండలి మెచ్చిందనో.. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని అమలుచేసే పరిస్థితి…
ఆ ఎమ్మెల్యే అమరావతి టూర్ సక్సెస్ అయిందా? నామినేటెడ్ పోస్ట్ వ్యవహారంలో ఇబ్బంది పడి.. ఇప్పుడు రిలాక్స్ అయ్యారా? పార్టీ పెద్దలతో మాట్లాడి పంతం నెగ్గించుకున్నారా? పదవి పొందిన నాయకుడి ప్రమాణ స్వీకారం ఆగిందా… ఆపారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ఆయనకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఎవరికీ టచ్లోకి రానని ప్రకటించిన ఎమ్మెల్యే! చిత్తూరు జిల్లాలో కొన్ని నామినేటేడ్ పదవులు స్థానికేతరులకు ఇవ్వడంతో తీవ్ర దుమారం రేపింది. ముఖ్యంగా కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల ట్రస్ట్ బోర్డ్ పదవుల భర్తీ..…
ఆ నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల మధ్య అస్సలు పడటం లేదు. ఆ ప్రభావం పార్టీ కమిటీలపైనా పడింది. మరోసారి ఆధిపత్య పోరుకు దారితీసింది. ఒక నియోజకవర్గం.. రెండు కమిటీలుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడో ఏంటో.. లెట్స్ వాచ్! తాండూరులో ఎవరి కమిటీ వారిదే..! వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు మరోసారి వార్తల్లో నిలిచారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం గ్రామ, వార్డు, మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్ఠానం నేతలందర్ని ఆదేశించింది. ఇప్పుడు…