ఆహ్వానాలు వెళ్లాయి సరే..! సెప్టెంబర్ 2నాటి YSR సంస్మరణ సభకు తెలంగాణ నుంచి హాజరయ్యేది ఎవరు? ఎంత మంది వెళ్తారు? మారిన రాజకీయ వాతావరణంలో నీడను కూడా నమ్మలేని స్థితిలో ఉన్న నాయకులు.. ఆహ్వానాన్ని మన్నిస్తారా? ఆహ్వానాలు అందుకున్న తెలంగాణ నేతలు తేల్చుకోలేకపోతున్నారా? సెప్టెంబర్ 2. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఈ తేదీపైనే ఎక్కువ మంది ఫోకస్ పెట్టారు. ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి కావడంతో.. ఆ రోజున హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన…
ఆ నియోజకవర్గంలో ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట. నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరే ఎడమొఖం పెడమొఖంగా ఉండే వాళ్ళు. ఇద్దరు కలిసి ఒక కార్యక్రమానికి హాజరైరా మాటలు ఉండేవి కావు. ఇప్పుడా ఇద్దరి మధ్యా మూడో వ్యక్తి ఎంట్రీతో మరింత గ్యాప్ పెరిగిందట. చివరికి మా ఎమ్మెల్యేని తక్కువ చేస్తే ఊరుకోం అని సంకేతాలిస్తున్నారట.. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గo. ఒకప్పుడు టీడీపీ కంచుకోట. ఈ నియోజకవర్గంలో లో 2019 మినహా గతంలో…
టిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనుందా? ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం తర్వాత ఆ దిశగా అడుగులు పడే ఛాన్స్ ఉందా ? అనువైన రాజకీయ పరిస్థితుల కోసం గులాబీ పార్టీ ఎదురు చూస్తోందా ? టిఆర్ఎస్ ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 2 న సీఎం కేసీఆర్ ఢిల్లీలో పార్టీ ఆఫీసు నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తారు. పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. టిఆర్ఎస్ ప్రస్థానంలో ఢిల్లీలో…
కామ్రేడ్ లు… క్లారిటీ తో ఉన్నారా… ?లేక కన్ఫ్యుజ్ అవుతున్నారా..? క్లారిటీ లేకపోవడంతోనే వరుస ఓటముల మూటగట్టుకుంటున్న కామ్రేడ్ లు…ఎక్కడ తప్పులో కాలు వేస్తున్నారు? తెలంగాణ ఏర్పాటు తర్వాత కామ్రేడ్ లు కునుకుపాట్లు పడుతున్నారు. ఒకప్పుడు రాజకీయం అంతా కామ్రేడ్ ల చుట్టూ తిరిగేది. కానీ ఇప్పుడు రాజకీయాల చుట్టూ కామ్రేడ్ లు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అటు సీపీఐ, ఇటు సీపీఎం రెండు పార్టీలు కూడా ఎవరితో కలిసి పని చేయాలనే క్లారిటీ లేకుండా పోతోందనేది ఓపెన్…
ఖాకీలకు కొన్ని పోలీస్ స్టేషన్లపై సెంటిమెంట్ ఎక్కువ. కలిసి వస్తుంది అనుకుంటే.. పోస్టింగ్‌ల కోసం ఓ రేంజ్లో పైరవీలు చేస్తారు. అదే రివర్స్‌లో ఉంటే పోలీస్ స్టేషన్ పేరు చెబితేనే హడలెత్తిపోతారు. ప్రస్తుతం ఆ PS గురించి అదే చర్చ జరుగుతోంది. మాకొద్దీ తలనొప్పి అని విసుగెత్తిపోతున్నారట అధికారులు. వైసీపీ, టీడీపీ మధ్యలో పోలీస్‌గా చర్చల్లో ఉన్న ఆ కథేంటో ఈ స్టోరీలో చూద్దాం. అధికారులు లేక స్టేషన్ ఖాళీ! చిత్తూరు జిల్లా చంద్రగిరి. పోలీస్‌శాఖ పరంగా…
తెలంగాణ ఆర్టీసీని సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ సెట్ చేస్తారా? పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ముద్రపడ్డ ఆయన్ని ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీకి పంపింది? ఎవరికి చెక్ పెట్టేందుకు తీసుకొచ్చారు? ఆర్టీసీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? సీనియర్ ఐపీఎస్‌తో మంత్రికి సఖ్యత కుదురుతుందా? తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు MDగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ వచ్చారు. ఈ నియామకంపై ఆర్టీసీతోపాటు.. ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీకి పూర్తిస్థాయి MD…
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు.. చేసే సమీక్షల్లో కొన్ని రహస్యంగా ఉంటాయి.. మరికొన్ని బయటకు చెబుతారు. కానీ.. రహస్యంగా ఉంచాల్సిన అంశాలే ఏపీలో బయటకొచ్చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వానికి చికాకులు తప్పడం లేదు. అందుకే కీలక నిర్ణయాలు తీసుకున్నారట. వాటిపైనే ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. లీకులపై విపక్షాలకు సమాధానాలు చెప్పడానికే టైమ్ సరిపోతోందా? ఆర్థికపరమైన అంశాలు.. ప్రభుత్వం వేసుకున్న లెక్కలు.. అందులో తప్పిదాలు.. నిర్లక్ష్యాలు.. నిబంధనల ఉల్లంఘనలు అంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. వీటికి…
అసలే అంతంత మాత్రంగా పనిచేస్తున్న వేళ.. పదవుల పంపకం కేడర్‌కు ఆగ్రహం తెప్పించిదట. పార్టీ జిల్లా పెద్దలు కూడా వారిని పట్టించుకోలేదని టాక్. ఎన్నికల్లో గెలిచిన ఆ ఒక్కరినీ పరిగణనలోకి తీసుకోలేదట. అదే చిత్తూరు జిల్లా టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం. టీడీపీ కమిటీల కూర్పుపై కేడర్ ఫైర్! అనుబంధ సంఘాల పదవుల కేటాయింపు తిరుపతి టీడీపీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. పదవుల భర్తీలో సమతూకం పాటించలేదనే విమర్శలు గుప్పుమన్నాయి.…
రాష్ట్ర రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు చురుకుగా ఉన్న ఆ ఎమ్మెల్యే.. సడెన్‌గా చంటిగాడు లోకల్ అయిపోయారు. కాంగ్రెస్ పెద్ద బాధ్యత అప్పగించినా ఉన్నట్టుండి సైలెంట్. ఆయనకేమైందో అంతుచిక్కడం లేదు. ఇదంతా వ్యూహమా.. కొత్త ఎత్తుగడా? ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్! లోకల్ పాలిటిక్స్‌కే పరిమితం అవుతారట! తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్. కాంగ్రెస్‌లో ట్విస్ట్‌లు కొత్తేం కాకపోయినా.. ఎప్పటికప్పుడు సరికొత్తగా ఉంటుంది నేతల తీరు. ఆ విధంగా లేటెస్ట్గా చర్చల్లోకి వచ్చారు టీపీసీసీ వర్కింగ్…
ఆడవారి మాటలకు అర్థాలే వేరన్నట్టు.. రాజకీయ నేతల మాటలకు అర్ధాలు వేరు. స్టేట్మెంట్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. మంత్రి మల్లారెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ మధ్య సవాళ్లూ ఆ కోవలోకే చేరతాయా? రాజీనామాలపై వారి ప్రకటనలు నమ్మొచ్చా.. లేక రాజీడ్రామాలా? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ట్రెండింగ్ సీన్ ఇదే. అసలే మంత్రి మల్లారెడ్డి. పక్కా నాటు. ఆయన్ని కెలికారు పీసీసీ చీఫ్ రేవంత్. ఇంకేముందీ మీడియా ముందుకు వచ్చి తొడలు కొట్టారు.. సవాళ్లు విసిరారు మంత్రిగారు. రాజీనామాలపై…