TPCC Complaints: వివాదాల లొల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్‌లో ఫిర్యాదులు కామన్ అయిపోయాయా? రోజుకో కంప్లయింట్ పీసీసీకి తలనొప్పిగా మారిందా? హైకమాండ్‌కు వివరణ ఇవ్వటానికే టైమ్ సరిపోతోందా? వరస ఫిర్యాదులపై అధిష్ఠానం ఏం చేయబోతుంది?
ప్రతి సమస్యపై ఏఐసీసీకి లేఖలు రాసేస్తున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌కి ప్రధాన శత్రువులు ఎక్కడో ఉండరు. సొంత పార్టీలోని నాయకులే.. పార్టీ నేతను కట్టడి చేస్తారు. అనుకున్నది అనుకున్నట్టు అయితే.. ఓకే..! లేదంటే హైకమాండ్‌కు ఫిర్యాదులు కామన్. ఇది కాంగ్రెస్‌లో సర్వసాధారణం. అందుకే కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటారు. ఈ తీరే పార్టీకి తలనొప్పిగా మారిందట. అసలు పనిని పక్కనపెట్టి నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు.. ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్‌పై వరసపెట్టి ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రతి సమస్యపై AICCకి లేఖలు రాసిపడేస్తున్నారట. ఈ విషయంలో సీనియర్లు.. జూనియర్లు అనే తేడా లేదట. సమస్య వచ్చిందా వెంటనే లెటర్ హెడ్ తీసుకుని కాపీ టు సోనియా కాపీ టు రాహుల్ గాంధీ అని లేఖలు వెళ్లిపోతున్నాయట.
Also Read
ఇప్పటికే హైకమాండ్‌కు వీహెచ్ లేఖ
ఇటీవల పీసీసీ మాజీ చీఫ్ హన్మంతరావు AICCకి లేఖ రాశారు. పార్టీ కార్యక్రమాల కోసం మంచిర్యాల వెళ్తే.. తనపై దాడి జరిగిందని.. ఆ విషయంలో పీసీసీ స్పందించిన తీరును ప్రస్తావిస్తూ హైకమాండ్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న సమస్యలపై చర్చించేందుకు పొలిటికల్ అడ్వయిజరీ కమిటీని సమావేశ పర్చాలని ఆ లేఖలో కోరారు వీహెచ్. ఇక వరంగల్ ఎపిసోడ్‌లో.. తనకు వెస్ట్ సీటు ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని జంగా రాఘవ చెప్పారు. దాంతో పీసీసీ బుజ్జగించాల్సి వచ్చింది. దీంతో వరంగల్ డీసీసీ రాజేందర్‌రెడ్డి అలకబూనారు. నేరుగా వెళ్లి VHతో తన సమస్య చెప్పుకొన్నారట రాజేందర్‌రెడ్డి. 2018 ఎన్నికల్లోనే తనకు వరంగల్ వెస్ట్ టికెట్ ఇవ్వకుండా.. ఇప్పుడు మరొకరికి ఎలా హామీ ఇస్తారని నిలదీశారట రాజేందర్‌రెడ్డి. అదే విషయాన్ని పీసీసీకి చెప్పడంతోపాటు AICCకి లేఖ రాశారట.
జనగామ పరిణామాలపై పొన్నాల అనుమానం
తాజాగా మరో సీనియర్ కాంగ్రెస్ నేత.. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సైతం అదే దారిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జనగామలో తనకు రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పొన్నాల అనుమానిస్తున్నారట. జంగా రాఘవతోపాటు.. పీసీసీ చీఫ్‌కు సన్నిహితంగా ఉండే నేతను జనగామలో ప్రోత్సహిస్తున్నారనే ఆవేదనలో ఆయన ఉన్నారట. అదే విషయాన్ని AICC పెద్దలకు.. స్థానిక బీసీ నాయకులకు చెప్పుకొన్నట్టు ప్రచారం జరుగుతోంది. జంగా రాఘవకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోకుండా.. పార్టీ ఎందుకు తాత్సారం చేస్తుందనే సందేహంలో ఉన్నారు పొన్నాల.
పీసీసీ చీఫ్ వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారట
ఇలా రాష్ట్ర కాంగ్రెస్ నుంచి రోజుకో ఫిర్యాదు వెళ్తోంది. పార్టీలో ఒకరిద్దరు సీనియర్ నేతలు కూడా లేఖలు ఢిల్లీకి సంధించారట. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరు ఘాటుగానే పార్టీ హైకమాండ్‌కు లేఖ రాశారని తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల కంటే.. పీసీసీ చీఫ్ వ్యక్తిగత ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆ లేఖలో ప్రస్తావించారట. ఇలాంటి లేఖలకు వివరణ ఇచ్చుకోవడానికే ఎక్కువ సమయం పోతోందట. వాటి గురించే కథలు కథలుగా చెప్పుకొంటున్నాయి గాంధీభవన్ వర్గాలు.
తాజావార్తలు
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్‌డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్‌కు చిరంజీవి మెగా బర్త్‌డే విషెస్!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!