ఆ ప్రాంతంలో జిల్లా విభజనపై ఒక రేంజ్లో ఉద్యమం జరుగుతుంటే.. ఒక మంత్రి.. ప్రతిపక్షపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మాత్రం సైలెంట్ అయ్యారు. మొన్నటి వరకు మాకు ఓటేయండి.. మన ఊరిని జిల్లా కేంద్రం చేయిస్తామని హామీలు ఇచ్చిన నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. నేతలను కదిపితే నోకామెంట్ అంటున్నారట. ఆ ప్రాంత నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? మున్సిపల్ ఎన్నికల్లో పెనుకొండే ప్రచార అస్త్రం అనంతలో జిల్లాల విభజనపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా…
నవ్వి పోవుదురుగాక నాకేంటి అనే చందాన ఉంది ఆ ఇద్దరు నేతల తీరు. చీకటి ఒప్పందం చేసుకుని కంకర కోసం కొండలు మాయం చేస్తున్నారట. ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి సొంత ఖజానా నింపుకొంటున్నారట. వారెవరో.. ఏంటో.. లెట్స్ వాచ్..! ప్రశ్నించేవాళ్లు లేరు.. నేతలదే రాజ్యం కడప జిల్లా జమ్మలమడుగులో అక్రమ మైనింగ్ యధేచ్చగా జరుగుతోంది. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు.. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఒప్పందం కుదిరిందట. దానిని ప్రశ్నించేవారే లేకపోవడంతో వాళ్లదే రాజ్యం.…
గుంటూరులో టీడీపీకి నాయకుల కొరత ఏర్పడిందా? అధికారంలో ఉన్నప్పుడు తామే మొనగాళ్లం అని చక్రం తిప్పిన నేతలు.. అధికారం పోగానే ముఖం చాటేశారా? నామ్ కే వాస్తేగా ద్వితీయశ్రేణి నాయకులతో టీడీపీ కాలం నెట్టుకొస్తోందా? ఇంఛార్జ్ నియామకంలో పార్టీ వైఫల్యం చెందుతోందా? తమ్ముళ్లకు రిప్లయ్ ఇచ్చేవాళ్లే లేరా? ఎప్పటి నుంచో ఉన్న బలమైన కేడర్ దూరంగుంటూరు జిల్లాలో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉండే నియోజకవర్గాల్లో సిటీలోని పశ్చిమ సెగ్మెంట్ ఒకటి. దీంతోపాటు గుంటూరు నగరంలోనే ఉండే మరో నియోజకవర్గం…
ఉప్పు-నిప్పుగా ఉన్న ఆ ఇద్దరు నాయకులు ఆత్మీయంగా పలకరించుకున్నారు. గంటల తరబడి మాట్లాడేసుకున్నారు కూడా. ఇంతకీ వాళ్లేం మాట్లాడుకున్నారు? చర్చకు వచ్చిన అంశాలేంటి? పార్టీలో చాలా ఘర్షణల తర్వాత కలిసిన ఇద్దరు నాయకులు.. మనసులో మాట బయట పెట్టేసుకున్నారా? పార్టీ వ్యవహారాలపై ఏం మాట్లాడుకున్నారు?తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఒక సంచలనం. రెండున్నర గంటలకుపైగా జరిగిన భేటీలో ఇద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలేంటనే ఆసక్తి పెరుగుతోంది.…
అసలే ఆళ్లగడ్డ. రాజకీయాలు ఓ రేంజ్లో ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్నాళ్లు పొలిటికల్ సందడి తగ్గినా.. ఒక్కసారిగా హైఓల్టేజ్..! పదునైన విమర్శలు.. సవాళ్లు..ఆరోపణలు ఆళ్లగడ్డను అట్టుడికిస్తున్నాయి. ఎందుకిలా? అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? రోడ్ల విస్తరణపై ఆళ్లగడ్డలో రాజకీయ సెగలుకర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ రాజకీయంగా కాక రేపుతోంది. భూమా, గంగుల కుటుంబాల మధ్య ఇప్పటికే రాజకీయంగా విభేదాలు భగ్గుమంటున్నాయి. రోడ్ల విస్తరణలో భాగంగా చేపట్టిన పనులు ఆ విభేదాలకు మరింత ఆజ్యం…
వాళ్లంతా పోలీస్ ఇన్స్పెక్టర్లు. యూనిఫామ్ డ్యూటీలో ఉన్న అధికారులు. సొంతంగా విదేశాలకు వెళ్లితే ఎలాంటి గొడవా ఉండేది కాదు. కానీ.. లిక్కర్ డాన్‌తో మిలాఖతై ఫారిన్ ట్రిప్పులకు వెళ్లి.. థాయ్ మసాజ్‌లు.. క్యాసినో ఆటల్లో మునిగి తేలారట. విషయం తెలిసి పోలీస్ బాస్‌లు కన్నెర్ర చేయడంతో డిపార్ట్మెంట్లో అలజడి మొదలైంది. వాళ్లెవరో లెట్స్ వాచ్..! జల్సాల కోసం విదేశాలకు ఇన్స్పెక్టర్లు..?బ్యాంకాక్‌లో విహార యాత్రలు.. థాయ్ మసాజ్‌లు.. శ్రీలంకలో అమ్మాయిలతో జల్సాలు..క్యాసినో జూదాలు.. ఇవన్నీ పారిశ్రామికవేత్తలో లేక సంపన్నులో…
చేసేదే అక్రమం. ఆ అక్రమాన్ని అడ్డంగా క్యాష్ చేసుకుంటున్నారు ఆ చోటామోటా నేతలు. బిజినెస్ బాగుండటం.. గిట్టుబాటు అవుతుండటంతో కొత్త కొత్త ముఠాలు ఈ దందాలో చేరిపోతున్నాయి. పోటీ పెరగడంతో ఒకరి రహస్యాలను ఇంకొకరు పోలీసుల చెవిన వేస్తూ పెద్ద నేతలకు తలనొప్పిగా మారారట. వేలకు వేలు వస్తుండటంతో కొత్త ముఠాలు ఎంట్రీప్రకాశం జిల్లాలో కొత్తరకం దందాకు తెరలేచింది. ‘జిల్లా’లో తరలించే గ్రానైట్ లారీల నుంచి వైసీపీ ద్వితీయశ్రేణి నేతలు వసూళ్లు మొదలుపెట్టారు. ఎప్పుడు ఏ లారీ…
అక్కడ నిబంధనలను గాలికి వదిలేశారా? అడ్డగోలు విధానాలతో అక్రమాలకు రాచబాట వేశారా? పక్కా ప్లానింగ్‌తో అవినీతికి పాల్పడుతున్నారా? లోకల్ లీడర్స్ సహకారంతో ఎవరికి తోచిన విధంగా వాళ్లు దండుకుంటున్నారా? ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. లోకల్ లీడర్స్ అండతోనే అక్రమ నిర్మాణాలుఆంధ్రప్రదేశ్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం.. తిరుపతి. ఇక్కడ భూముల రేట్లు ఆకాశాన్ని తాకితే.. నిర్మాణాలకు భారీ డిమాండ్. ఈ డిమాండే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో కొందరు సిబ్బందికి కాసులు కురిపిస్తోంది. నగరపాలక…
ఆ మున్సిపాలిటీలో ఒకరి వెంట ఒకరు సరెండర్ అవుతున్నారా? మాట వినని వారికి అదే పనిష్మెంటా? కావాలని తీసుకొచ్చినవాళ్లే.. తిరుగు టాపా కట్టించేస్తున్నారా? దీంతో అక్కడికి రావడానికి అధికారులు, ఉద్యోగులు జంకే పరిస్థితి ఉందా? మాట వినకపోతే కౌన్సిల్లో తీర్మానం చేసి సరెండర్ చేస్తున్నారా?ఈ మధ్య కాలంలో కొత్తగూడెం రాజకీయాలు చాలా హాట్ హాట్‌గా ఉంటున్నాయి. వనమా రాఘవ ఎపిసోడ్ తర్వాత అక్కడ చీమ చిటుక్కుమన్నా అటెన్షన్ వచ్చేస్తోంది. ఇప్పుడు కొత్తగూడెం మున్సిపాలిటీ వంతు వచ్చింది. పురపాలక…