తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. ఎక్కే ఫ్లైట్.. దిగే ఫ్లైట్ అన్నట్టు ఉంది కాంగ్రెస్ నేతల పరిస్థితి. ఏఐసీసీకి కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వచ్చాక.. తెలంగాణ పంచాయతీ ఆయనకు పెద్ద తలనొప్పిగా మారిందట. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లడం.. ఖర్గేతో మర్యాదపూర్వకంగా కలవడం జరుగుతోంది. కానీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం.. తమ పాత పద్ధతిని వదులుకోవడం లేదట. మల్లికార్జున ఖర్గే దగ్గర తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీని మొదలుపెట్టారట. నాలుగైదు రోజులు…
కృష్ణా జిల్లా వాసుల దశాబ్దాల కల బందరు పోర్టు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో బందరు పోర్టు నిర్మాణానికి బీజం పడింది. శంఖుస్థాపన చేశారు. ఆ తర్వాత అప్పట్లో మారిన రాజకీయ పరిణామాలతో బందరు పోర్టు నిర్మాణం కాగితాలకే పరిమితం అయింది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ పోర్టు నిర్మాణం కోసం కొంత ప్రయత్నం చేసింది. పోర్టు నిర్మాణం పేరుతో కొంత భూసేకరణ చేసి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. ఈ…
ఉమ్మడి విశాఖజిల్లా వైసీపీకి చాలా కీలకం. రాజకీయ అవసరాల కోసమే కాదు భవిష్యత్ రాజధానిగా ఈ ప్రాంతంపై అంచనాలు ఎక్కువే. ఉత్తరాంధ్రను స్వీప్ చెయ్యడం ద్వారా తమ విధానాలకు ప్రజామోదం లభించిందనే బలమైన సంకేతాలు పంపించాలనేది అధికారపార్టీ ఆలోచన. వచ్చే ఏడాది ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నుంచి పాలన ప్రారంభం అవుతుందనే టాక్ ఉంది. ఇంతటి కీలక దశలో ఉమ్మడి విశాఖ జిల్లాపై సంపూర్ణ ఆధిపత్యం సాధించడం వైసీపీకి అత్యవసరం. ఇదే విషయాన్ని పదేపదే అధిష్ఠానం చెబుతోంది. కానీ,…
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచింది. ఇక్కడ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, పీసీసీ నేత సంజీవ్‌రెడ్డి మధ్య ఒక్క క్షణం పడటం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరూ తీవ్రంగా పోటీ పడుతున్నారు. తండ్రుల వారసత్వంతో రాజకీయం చేస్తూ.. దానిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. 2016లో అప్పటి ఎమ్మెల్యే కిష్టారెడ్డి చనిపోవడంతో.. ఇక్కడ కాంగ్రెస్‌లో మొదలైన జగడం…
ఇటీవల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన కార్యవర్గంలో ప్రొద్దుటూరు సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి చోటు కల్పించింది ఆ పార్టీ హైకమాండ్. గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పీసీసీలో పదవి ఇవ్వడంతో అది చూసిన వాళ్లు ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారని అనుకున్నారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వరదరాజులరెడ్డి కాంగ్రెస్‌లో చేరారని భావించారు. అయితే కాంగ్రెస్‌లో చేరలేదని.. ఇంకా టీడీపీలోనే ఉన్నారనని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. Read Also:…