వరస సమీక్షలు.. హెచ్చరికలు తర్వాత మాట వినని పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు వైసీపీ అధినేత, సీఎం జగన్. వైసీపీలో కీలక స్థానాల్లో ఉన్న ముఖ్య నేతలనే పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. రెండు నెలల కిందట గడప గడపకు మన ప్రభుత్వం సమీక్ష సందర్భంగా రీజినల్ కోఆర్డినేటర్ల పనితీరును అసెస్ చేసిన జగన్.. కొంతమంది పనితీరుపై ఓపెన్‌గానే అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, మంత్రి…
తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ లక్ష్యంగా ఏఐసీసీకి ఫిర్యాదులు వెళ్లాయి.. ఇంకా వెళ్తూనే ఉన్నాయి. కాంగ్రెస్‌లో ఇది సహజమైన చర్యే. దీనికితోడు వరుసగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో అధిష్ఠానం కూడా దిద్దుబాటు చర్యలకు దిగాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైన…
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వీడియోల్లో ఒక వర్గాన్ని దూషించినట్టు తీవ్రమైన ఆరోపణలొచ్చాయి. అయితే, ఆ విమర్శలు కేవలం ప్రత్యర్థులు, ఇతర మతాల వాళ్లు మాత్రమే చేయలేదు. స్వయంగా ఆయన పార్టీ అధిష్టానం కూడా ఆ వీడియోలను సీరియస్‌గానే తీసుకుంది. అప్పుడప్పుడే నూపుర్ శర్మ వివాదం నుంచి తేరుకుంటున్న బీజేపీ అధిష్ఠానం రాజాసింగ్ వ్యవహారం మరో తలనొప్పిగా మారకూడదని నిర్ణయించుకుంది. అందుకే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వివరణ అడిగింది. Read Also: Off The…
గతంలో ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. ఎంపీగా పనిచేసిన అనుభవం ముద్రగడ పద్మనాభానికి ఉంది. సమయానుకూలంగా పార్టీలు మారుతూ కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు.. మరికొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. 1994లో తొలిసారి ప్రత్తిపాడులో ఓడిన తర్వాత.. ఇక జీవితంలో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాబోనని భీష్మించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ సీట్ ఆఫర్ చేయడంతో పిఠాపురంలో పోటీ చేసినా.. ఆ సీటును ప్రజారాజ్యం పార్టీ గెల్చుకుంది. ఆపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగి.. కాపు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. తర్వాత…
కొంతకాలంగా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి లోకల్ టీఆర్ఎస్ కీలక నేతలకు, ఉద్యమకారులకు మధ్య గ్యాప్ వచ్చింది. టిడిపి నుండి టిఆర్ఎస్ లోకి వచ్చిన వారితోనూ దూరమే. చివరకు తెలంగాణ ఉద్యమకారులు టచ్ మీ నాట్‌గా ఉండటంతో.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒంటరైన పరిస్థితి. ఆలస్యంగా సమస్యను గుర్తించినా.. ఆ తీవ్రత వచ్చే ఎన్నికల్లో ప్రతికూలంగా మారుతుందని MLA గ్రహించారట. వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు భూపాల్‌రెడ్డి. అయితే, కొద్దిరోజులుగా ఎమ్మెల్యే డైలీ ప్రోగ్రామ్స్ మారిపోయాయి. ఉద్యమ…
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌లో కొట్లాటలు.. గ్రూప్ రగడ కొత్తమీ కాదు. ఢిల్లీ స్థాయి నేతల మధ్య కూడా గల్లీ లెవల్లో విభేదాలు బయట పడుతుంటాయి. ఒక్కో సెగ్మెంట్లో మూడు ముక్కలాటలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మధ్య విభేదాలు ఉన్నాయి. తాజాగా రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక.. ఆయనదో వర్గం ముందుకొచ్చింది. ఈ విధంగా ముగ్గురు కీలక నాయకుల పేర్లు చెప్పి పార్టీ కేడర్ మూడుగా విడిపోయిన పరిస్థితి. ఎవరిని…
అనంతపురం జిల్లా రాప్తాడు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేవి రాజకీయ వివాదాలే. మాజీ మంత్రి పరిటాల సునీత, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మధ్యలో రెండు వర్గాలు శాంతించినా.. పరిటాల సునీత పాదయాత్ర చేస్తాననడంతో పొలిటికల్ టెంపరేచర్ పెరిగిపోయింది. ఇంతలో ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డిని జాకీ పరిశ్రమ వివాదం కొత్తగా చుట్టుముట్టడంతో రాప్తాడులో రాజకీయ సెగలు రేగుతున్నాయి. జిల్లాలో లేని పరిశ్రమ చుట్టూ సాగుతున్న పాలిటిక్స్ ఏకంగా తాడేపల్లిని తాకడంతో హాట్ టాపిక్‌గా మారిపోయింది.…
తనదాకా వస్తే తెలియదన్నట్టుంది కాంగ్రెస్ నేతల పరిస్థితి. ఎఐసీసీ నాయకత్వాన్ని తిట్టినా పట్టించుకునే తీరిక.. ఆలోచన లేదు. ఎవరికి వారు నాకెందుకులే అని వదిలేస్తున్నారట. తిట్టింది నన్ను కాదు కదా అనే భావన మరికొందరిది. తిట్టేవాళ్లు తిట్టని.. పడేవాళ్లు పడని అనుకుంటున్నారో ఏమో.. చివరకు రాహుల్‌గాంధీ మొదలుకొని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వరకు అందరినీ దూషించినా ఒక్కరిలోనూ చలనం లేదు. కాంగ్రెస్‌కు లాయలిస్ట్‌గా కొనసాగిన మర్రి శశిధర్‌రెడ్డి పార్టీ నుంచి వెళ్తూ వెళ్తూ రాహుల్‌గాంధీని, కెసి వేణుగోపాల్‌ను..…
గద్వాల.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నడిగడ్డగా పిలిచే ప్రాంతం. ఇక్కడి రాజకీయం ఓ పట్టాన అంతుబట్టదు. రాష్ట్ర రాజకీయం అంతా ఒకలా ఉంటే గద్వాల రాజకీయం మరోలా ఉంటుంది. గతంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలేవి. తాజాగా స్వపక్షంలోనే విపక్షం పుట్టుకొచ్చింది. అదను చూసి అప్పర్ హ్యండ్ కోసం ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్న పరిస్థితి అధికారపార్టీలో కనిపిస్తోంది. అయితే నేతల మధ్య ఆధిపత్యపోరులో నియోజకవర్గంలోని అధికారులు నలిగిపోతున్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ సరితా…