గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు కారెక్కేశారు. అక్కడ కాంగ్రెస్ సీటు ఖాళీగా ఉందని భావించిన నాయకులు కర్చీఫ్‌లు వేస్తున్నారు. టికెట్ కోసం తన్నుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరి స్థాయిలో వారు కుంపట్లు రాజేస్తూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదెక్కడో.. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. పరస్పరం ఆధిపత్య పోరాటం కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టు ఉండేది. గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచింది కూడా కాంగ్రెస్సే. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న వనమా…
మంత్రి పినిపె విశ్వరూప్ రాజకీయ వారసుడిగా చిన్న కొడుకు శ్రీక్రాంత్ ఎంట్రీకి వైసీపీ అధిష్ఠానం ఓకే చెప్పిందట. విశ్వరూప్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న అమలాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా కుమారుడిని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేశారట. దీంతో కొంతకాలంగా విశ్వరూప్ వారసుడి ఎంట్రీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఇటీవల ముంబైలో గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు మంత్రి. హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటూ.. అప్పుడప్పుడూ అమలాపురం, తాడేపల్లికి వచ్చి వెళ్తున్నారు. దీంతో…
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై జనసేన ప్రత్యేక ఫోకస్ పెట్టిందట. ఇప్పటివరకు పార్టీ ప్లస్ లు మైనస్ లు అంచనాలు వేసుకున్న నేతలు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారట. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఓట్లు సీట్లలో పీఆర్పీ ఉనికి చాటుకుంది. మొత్తం 19 స్థానాలుగాను నాలుగుచోట్ల గెలవగా, 8 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. 5 చోట్ల చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు చీల్చింది ప్రజారాజ్యంపార్టీ. గత ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాలులో పోటీ చేసినప్పటికీ జనసేన ఒక్కచోటే…
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంతో BRS- BJP మధ్య రాజకీయం మరింత హీటెక్కింది. వ్యాపార, బ్యాంకు లావాదేవీల సమాచారంతో రావాలని కోరింది ED. అయితే ఏ కేసులో ఈ సమన్లు జారీ చేశారన్నది స్పష్టత లేదంటున్నారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి. పైగా ఈడీ నోటీసుల వెనుక మతలబేంటి అని లెక్కలు వేసుకుంటున్నారట. ఈడీ నోటీసులు.. ఈడీ ఎదుట హాజరు కావడం ఎలా ఉన్నా.. ఇది…
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిర్యాలగూడలో తనకున్న ప్రతికూల పరిస్థితులపై దృష్టి పెట్టారు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి కారెక్కిన ఆయన.. 2018లో టీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి రెండోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు స్కెచ్ వేస్తున్నారు భాస్కరరావు. అయితే రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక.. నియోజకవర్గంలో ఆయనకు ఇంటా బయటా రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. కొత్తలో వాటిని భాస్కరరావు లైట్ తీసుకున్నా.. హ్యాట్రిక్ విజయానికి…
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, జనసేన నెంబర్ టు నాదెండ్ల మనోహర్ భేటీ.. పొలిటికల్ సర్కిళ్లలోనే కాదు.. సామాన్య ప్రజల్లోనూ పెద్ద చర్చ జరుగుతోంది. బీజేపీతోపాటు.. ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కన్నా.. అంత ఈజీగా మీడియాలో ఫోకస్ అవ్వాలన్న ఆలోచన చేయరు. అదే విధంగా జనసేన PAC చైర్మన్‌గా ఉన్న మనోహర్ సైతం ఇంటర్నల్ వ్యవహారాలు మీడియా ముందు ఉంచరు. అలాంటి ఇద్దరు నేతలు హఠాత్తుగా భేటీ అవ్వడం..…
ఉమ్మడి విశాఖజిల్లాలో ఒకప్పుడు ఎంపీలు చాలా పవర్ ఫుల్. సుదీర్ఘ అనుభవం, విస్త్రతమైన పరిచయాలతో ఓ వెలుగు వెలిగేవాళ్లు నాయకులు. సీనియారిటీ, సంప్రదాయంగా సీట్లు కేటాయించే విధానానికి తొలిసారి బ్రేకులు వేసింది వైసీపీ. 2019లో అనూహ్యంగా కొత్త ముఖాలను తెరపైకి తెచ్చి గెలిపించుకుంది. వైసీపీ నుంచి విశాఖ ఎంపీగా ప్రముఖ బిల్డర్ MVV సత్యనారాయణ, ఎస్.టి. రిజర్వ్డ్ నియోజకవర్గం అరకు నుంచి గోడ్డేటి మాధవి.. అనకాపల్లి నుంచి డాక్టర్ సత్యవతమ్మ గెలిచారు. ఈ ముగ్గురు రాజకీయంగా నిలదొక్కుకునేందుకు…