Off The Record: కేశినేని ఎపిసోడ్ తో టీడీపీలో టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ముందు కేశినేని బాంబ్ ఎప్పుడు పేలుతుందోననే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. మూడు రోజుల పాటు కేశినేని నాని చేసిన కామెంట్లు పార్టీలో తీవ్ర చర్చకు దారి తీశాయి. గొణుక్కునేవారు గొణుక్కున్నారు. సంతోషించే వారు సంతోషించారు. అయితే పార్టీ అధినాయకత్వం ఈ విషయంలో ఏం ఆలోచిస్తోంది? అధిష్టానం మదిలో ఏముంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకోకుంటే.. మున్ముందు మొసళ్ల పండుగ తప్పదనే చర్చ టీడీపీలో విస్తృతంగా జరుగుతోంది.
Also Read
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Off The Record: రొటీన్‌కు భిన్నంగా ఆ మౌనవ్రతం ఎందుకు?.. కోలగట్ల వైఖరిపై వైసీపీలో చర్చ
టీడీపీలో కేశినేని నాని టెన్షన్
దీపావళికి లక్ష్మీ టపాస్ ఎంత సౌండ్ చేస్తుందో ఏమో కానీ.. అంతకుమించిన స్థాయిలో టీడీపీలో కేశినేని బాంబ్ గట్టిగానే పేలింది. చాలా కాలం సైలెంట్‌గా ఉన్న కేశినేని.. సింపుల్‌గా మూడు రోజుల పాటు చేసిన రాజకీయం, కామెంట్లు పార్టీలో విపరీతమైన చర్చకు దారితీశాయనే చెప్పాలి. పైగా ఇది ఇక్కడితో ఆగదు అనే సంకేతాలు కూడా కేశినేని నాని ఇచ్చారు. దీంతో కేశినేని బాంబ్ మళ్లీ ఎప్పుడు పేలుతుందో తెలియడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీ అధినాయకత్వం సహా.. అందరూ క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలు రూపొందించుకుంటున్న ఈ సమయాన్ని టీడీపీ అధిష్టానం చాలా ఇంపార్టెంట్ టైమ్‌గా భావిస్తోంది. ఈ క్రమంలో కేశినేని టపాస్ బ్లాస్ట్ అయితే ఇబ్బందులు తప్పవనే చర్చ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
నాని ఎపిసోడ్‌ను త్వరగా సెట్ చేస్తే బెటరని భావన
బెజవాడ ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్‌ను వీలైనంత త్వరగా సెట్ చేసుకుంటే బెటరని భావిస్తున్నారట టీడీపీ పెద్దలు. అలా కాకుండా.. కేశినేని నాని కామెంట్లను చూసీచూడనట్టుగా వదిలేస్తే.. పరిణామాలు వేరే విధంగా ఉండే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రత్యర్థి పార్టీలో అసంతృప్త గళం వినిపించిన మరుక్షణం… దాన్ని సర్దుబాటు చేసుకోవడమో, అది కుదరకుంటే చర్యలు తీసుకోవడమో జరుగుతుంది. కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే తాము మాత్రం చతికిలిపడిపోతున్నామని స్వపక్ష సీనియర్లు అంటున్నారు. కనీసం డామేజ్ కంట్రోల్ మెకానిజం అనేది కూడా లేకుండా వదిలేస్తే కష్టమనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. గత ఎన్నికల్లో ఫ్యాన్ గిర్రున తిరిగిన సందర్భంలోనూ నాని గెలిచారంటే… కచ్చితంగా నానిని గౌరవించుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందని అంటున్నారు కొందరు సీనియర్లు. ఈ క్రమంలో నానితో సంప్రదింపులు జరిపితే బెటరనే భావన వారిలో వ్యక్తమవుతోంది. Spot
విజయవాడ పార్లమెంట్ టీడీపీ బాధ్యుడు ధూళిపాళ్ల
పార్టీలో కేశినేని నానితో ఎవరు సన్నిహితంగా ఉంటారో గమనించి.. వారికి సంప్రదింపులు బాధ్యత అప్పగిస్తే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారట. ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పర్యవేక్షణ.. పరిశీలన బాధ్యతలను పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర చూస్తున్నారు. కేశినేని నానికి, ధూళిపాళ్లకు మధ్య సన్నిహిత సంబంధమే ఉంది. నాని దూకుడుకు బ్రేకులు పడాలంటే ధూళిపాళ్లే కరెక్ట్ అనే అభిప్రాయం ఉంది. కానీ ధూళిపాళ్ల మాత్రం ఈ వ్యవహారాన్ని సెట్ చేసేందుకు ఎందుకు ముందుకు రావడం లేదనే చర్చ జరుగుతోంది. నాని అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు లేక ధూళిపాళ్ల నరేంద్ర ముందుకు రావడం లేదా? లేక అధిష్టానం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదా? అని చర్చించుకుంటున్నారు.
నానిపై పార్టీలోని సదరు పెద్దలు అసంతృప్తి
పార్టీ హైకమాండ్ నాని కామెంట్లపై సీరియస్‌గానే ఉన్నట్టు సమాచారం. అయితే నాని కామెంట్లకు స్పందించి.. రియాక్ట్ అయితే మరింత చర్చకు, రచ్చకు దారి తీసినట్టువుతందనే భావనతో ప్రస్తుతానికి నేతలను సైలెంట్‌గా ఉండమని చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు నాని బహిరంగ కామెంట్లు చేశారు కానీ.. పార్టీ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల వద్ద కూడా పార్టీ పెద్దలను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు హైకమాండ్ దృష్టికి వెళ్లాయట. దీంతో నాని విషయంలో పార్టీలోని సదరు పెద్దలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
ధూళిపాళ్లకు నానిని సెట్ చేసే బాధ్యత!
ఇటీవల పార్టీ అధిష్టానం వద్ద జరిగిన ఓ సమావేశంలో నాని ప్రస్తావన వచ్చిందట. పార్టీని, నేతలను, అధిష్టానాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా నాని కామెంట్లు చేస్తున్నారనే భావన వ్యక్తమైనట్టు తెలుస్తోంది. పార్టీలో పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలుగా ఉన్న వారు.. వాటిని ఎందుకు సర్దుబాటు చేయడం లేదని చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నానిని సెట్ చేసే బాధ్యతను ధూళిపాళ్లకు అప్పజెప్పినట్టు తెలుస్తోంది. Spot
నానిని సెట్, లేదంటే చర్యలు తీసుకోవాలని చర్చ
మొత్తానికి వీలైనంత వరకు నాని ఎపిసోడ్‌ను సెట్ చేయాలని, లేకుంటే ఆయనపై చర్యలు తీసుకోవాలనే తరహాలోనే చర్చ జరుగుతోంది. నానిని నేరుగా పార్టీ అధినాయకత్వమే పిలిచి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందనే భావన వ్యక్తమవుతోంది. మరి నాని యాక్షన్‌కు అధిష్టానం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి