Off The Record: బెజవాడ టీడీపీలో ఏం జరుగుతుంది?
- అనుచరులతో ఎమ్మెల్యే బోండా ఉమకు తలనొప్పులు..
- వీధి పోరాటాల స్థాయికి అనుచరుల మధ్య ఆధిపత్యం..
- అంతా నేనే అన్నట్టుగా వ్యవహరిస్తున్న ముఖ్య అనుచరుడు మాల్యాద్రి..
- షాడో ఎమ్మెల్యే అయ్యారన్న ఆరోపణలు..
- సెంట్రల్‌లో తన ముద్ర కోసం మాల్యాద్రి ప్రయత్నిస్తున్నారా?..
- ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యేతోపాటు తన ఫోటో ఉండాలని ఆదేశాలు?..
- ఫ్లెక్సీలో ఫోటో విషయమై మాల్యాద్రి, కార్పొరేటర్ మధ్య గొడవ..
- కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్‌పై మాల్యాద్రి చేయి చేసుకున్నారా?..
- ఎమ్మెల్యే అనుచరుల వీధి పోరాటాలపై కథలు కథలుగా ప్రచారం..
- ఇద్దరి మధ్య ఆర్థిక, భవన నిర్మాణ వ్యవహారాలు ఉన్నాయా?..
- మాల్యాద్రి సొంత టీమ్‌తో అన్నిటిలో తల దూరుస్తున్నారా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు బోండా ఉమా. ఇప్పటికి మూడుసార్లు పోటీ చేసి రెండు విడతలు గెలిచారాయన. 2019లో కేవలం 23 ఓట్ల తేడాతో ఓడిపోవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. అలా…. వోవరాల్‌గా…. నియోజకవర్గం మీద ఆయనకు గట్టి పట్టుందని చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టే అనుచరగణం కూడా భారీగానే ఉంటుంది. అదే ఇప్పుడు ఎమ్మెల్యేకి తలనొప్పిగా మారుతోందట. తమలో తాము ఆధిపత్య పోరుకు దిగడం, అది వీధి పోరాటాల స్థాయికి చేరుకోవడంతో…. కంట్రోల్ చేయలేక బోండా ఉమకు తల ప్రాణం తోకకు వస్తున్నట్టు తెలుస్తోంది. వాళ్ళని అలాగే వదిలేస్తే… రాబోయే రోజుల్లో ఎక్కడ తన పుట్టి ముంచుతారోనన్న భయం కూడా ఉందట ఎమ్మెల్యేకి. బోండా ఉమా రెండోసారి గెలిచాక అనుచర వర్గం కూడా పూర్తి స్థాయిలో యాక్టివ్ అయింది. ఇదే సమయంలో ఆయనకు సన్నిహితంగా ఉంటున్న మాల్యాద్రి అనే నాయకుడు అంతా తానే అన్నట్టు వ్యవహరిస్తున్నారట. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా….. ఎమ్మెల్యే ఉమా పేరు చెప్పి మాల్యాద్రే చక్రం తిప్పుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మాల్యాద్రి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల్ని టీడీపీ నాయకులే చేస్తున్నారు. అన్ని డివిజన్స్‌లో తిరుగుతూ… తానే ఎమ్మెల్యే అన్నట్టు బిల్డప్‌లు ఇస్తూ…. తన ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారన్నది లోకల్ తెలుగుదేశం కేడర్ చెబుతున్న మాట.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో ఎక్కడ బోండా ఉమ ఫ్లెక్సీ పెట్టినా…అందులో తన ఫోటో తప్పకుండా వేయాలంటూ షరతు పెడుతున్నారని, అసలు ఎమ్మెల్యే ఎవరో కూడా అర్ధంకావడం లేదని తమ్ముళ్ళే గుసగుసలాడుకుంటున్నారు. కొన్నిచోట్ల అయితే… స్థానిక నేతలు ఎవరూ లేకుండా కూడా మాల్యాద్రి, ఎమ్మెల్యే ఫోటోతో ఫ్లెక్సీలు పెట్టించడం వివాదాస్పదం అవుతోంది. ఈ విషయమై కొందరు నాయకులు లోలోపల కుతకుతలాడిపోతున్నారట. బోండా ఉమా పుట్టిన రోజు సందర్భంగా గవర్నర్‌పేటలో పెట్టిన ఫ్లెక్సీల్లో స్థానిక కార్పొరేటర్, మున్సిపల్ కార్పొరేషన్‌లో పార్టీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాల ఫోటో లేకపోవడం దుమారం రేపింది. ఈ విషయమై బాల, మాల్యాద్రి మధ్య మాట మాట పెరిగి…. మాల్యాద్రి చెయ్యి చేసుకున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నియోజకవర్గ ముఖ్య నాయకులు ఇలా రోడ్డున పడటం గురించి కథలు కథలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం ఎమ్మెల్యేదాకా వెళ్ళడంతో… ఆయన పార్టీ కార్పొరేటర్ బాలాని పిలిచి క్లాస్ పీకారని సమాచారం. అయితే ఈ వివాదానికి ఫ్లెక్సీలు మాత్రమే కారణం కాదని, అంతకు మిచిన వ్యవహారాలు చాలానే ఉన్నాయన్నది ఇన్‌సైడ్ టాక్.
Also Read
ఇద్దరి మధ్య ఆర్థికపరమైన విషయాలు, భవన నిర్మాణాల వ్యవహారాలు కూడా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. మాల్యాద్రి కొంత మందితో టీమ్ ఏర్పాటు చేసి… నియోజకవర్గంలోని అన్ని ఆర్థిక వ్యవహారాల్లో తలదూరుస్తున్నారన్నది లోకల్ టాక్. డివిజన్లలో పార్టీ కోసం పనిచేస్తున్న తమను దాటి మాల్యాద్రి అండ్ టీమ్ శృతిమించి వ్యవహరిస్తోందంటూ కొందరు స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ… ఆ సంగతి ఎమ్మెల్యేకి నేరుగా చెప్పలేకపోతున్నారట. ఇదే సమయంలో నియోజకవర్గానికి కీలకమైన బీసెంట్ రోడ్డు వ్యవహారంలో పట్టు కోసం మాల్యాద్రి, నెలిబండ్ల బాల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందట. వ్యవహారం రచ్చకెక్కటానికి అది కూడా ఒక కారణమనేనని అంటున్నారు. వీటన్నిటిపై సీరియస్ అయిన బోండా ఉమా అనుతరుల మీద సీరియస్ అయినట్టు సమాచారం.
తాజావార్తలు
-
CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!