Odisha Train Accident: మరుభూమిలో ప్రేమ కవితలు… రైలు ట్రాక్ పై డైరీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Train Accident: ప్రమాదం చిన్నదైనా పెద్దదైనా కచ్చితంగా కొన్ని కథలను మిగుల్చుతుంది. ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో కూడా అలాంటిదే కనిపించింది. ప్రమాదం తర్వాత ఎక్కడ చూసినా ప్రయాణికుల మృతదేహాలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. ఏడుస్తున్న ప్రయాణీకుల కళ్లు తమ ప్రజలను చూడాలని తహతహలాడుతున్నాయి. ఇక లోకాన్ని చూడలేక అమాయకులైన ప్రయాణికులు శాశ్వతంగా సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలోనే ట్రాక్‌లపై పడి ఉన్న కొన్ని పేజీలు, స్కెచ్‌లు ప్రజల దృష్టిని ఆకర్షించాయి.
Read Also:Maharashtra : ఘోర రోడ్డు ప్రమాదం..బస్సును ఢీ కొట్టిన కారు.. ఐదుగురు మృతి..
Also Read
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
డైరీలో కవితలు వ్రాసిన చాలా పేజీలు ట్రాక్‌లపై పడి ఉన్నాయి. ఈ పద్యాలు బెంగాలీ భాషలో ఉన్నాయి.పూవులు, ఏనుగు, చేప బొమ్మలు, అంతా సహజత్వం పెనవేసుకున్న డైరీ విప్పుకుని కనిపించింది. బెంగాలీ భాషలో రాసిన ప్రేమ కవితలు అందులో నిక్షిప్తమై ఉన్నాయి. ‘చెదురుమదురుగా కనిపించే మేఘాలు సన్నటి వర్షాన్ని కురిపిస్తాయి. మనం వినే చిట్టి కథలే మనలో ప్రేమను వికసింపజేస్తాయి’ అంటూ స్వదస్తూరితో రాసిన కవిత చదివిన వారి గుండెను పిండేస్తుంది. ‘ప్రేమవై నీవు నాకు ఎల్లప్పుడూ కావాలి, నా మనసులో నీవెప్పుడూ ఉంటావు’ అంటూ మరో కవిత ఉన్నది. ఈ డైరీ ఫొటోలు సోషల్ మీడియాకు ఎక్కాయి. జీవితం ఎంత చంచలమైందో కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Read Also:NTR: దేవర టైటిల్ కి ఏజెంట్ పాత్రకి అసలు సంబంధం ఉందా బాసూ?
Just 2 days back, there was a train accident in Balasore, India.
Too many died and a lot more had serious injuries.
A bundle of love letters and poems were found amongst the debris on the tracks.
A glimpse of a lost romance. A rarity in this age.
Give this post a read. pic.twitter.com/MHUq8LplyD
— Chandra Bhushan Shukla (@shuklaBchandra) June 4, 2023
ఎవరి డైరీ? ఎవ్వరికి తెలియదు
ఈ కవితలు ఎవరు రాశారు, ఎవరి డైరీ యాత్రికుడికి సంబంధించినది అనే సమాచారం ఇంకా తెరపైకి రాలేదు. అంతేకాక ఇప్పటివరకు ఎవరూ వాటికోసం అడగలేదు. ఒక వేళ అడిగితే అప్పుడు ఇచ్చేందుకు పోలీసు అధికారులు పేజీలను భద్రపరిచారు. ఇలాంటి అనేక ఇతర విషయాలు తమలో తాము కథను చెప్పుకునే ట్రాక్‌లపై పడి ఉన్నాయి. ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో 275 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో దాని బోగీలు లూప్ లైన్‌పై నిలబడి ఉన్న గూడ్స్ రైలును ఢీకొనడంతో, రైలు వెనుక భాగం అటుగా వెళ్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!