Odisha Train Accident: మూడు దశాబ్ధాల్లో ఎప్పుడూ లేని విధంగా ఒడిశా బాలాసోర్ రైలు దుర్ఘటన పెను విషాదాన్ని నింపింది. 275 మంది ప్రయాణికులు మరణించారు. 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఇదిలా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే బోర్డుతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత అసలు విషయం వెలుగులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
Read Also: Pawan kalyan ‘bro ‘: క్రేజీ అప్డేట్..పవన్ కళ్యాణ్ సినిమాలో చిరు హీరోయిన్..
ఇదిలా ఉంటే ఈ ప్రమాదానికి మూడు నెలల ముందు ‘‘ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ’ వైఫల్యాన్ని ఓ ఉన్నతాధికారి గుర్తించారు. నైరుతి రైల్వే జోన్ ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ తన ఉన్నతాధికారులకు ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఓ లేఖ రాశారు. దీనికి అంతకుముందు రోజు జరిగిన ఓ సంఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 8న సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ కు తప్పిన ప్రమాదాన్ని గురించి లేఖలో ప్రస్తావించారు. ఆ రోజు అప్ మెయిన్ లైన్ లో వెళ్లేందుకు తొలుత అనుమతి లభించింది. కానీ కొద్దిదూరం వెళ్లాక డౌన్ మెయిన్ లైన్ వెళ్లేలా ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ఉండటాన్ని లోకో పైలెట్ గమనించి రైలును ఆపేశాడు. ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ప్రకారం వెళ్లి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు ఈ ఉదంతం తెలుపుతోందని లేఖలో ప్రస్తావించారు. కొన్ని సందర్భాల్లో సిగ్నల్ ప్రకారం వెళ్లాల్సిన రైలు ట్రాక్ మారిపోతోందని, ఈ వైఫల్యాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇదే విధంగా జరిగితే ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని లేఖలో హెచ్చరించారు.