Viral Video: ఒడిశాలో భయానక ఘటన చోటుచేసుకుంది. జాజ్‌పూర్ జిల్లాలో ఓ మహిళను మొసలి నదిలోకి ఈడ్చుకెళ్తున్న సంఘటన స్థానికంగా ప్రజల్లో భయాందోళల్ని నింపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధిత మహిళను 57 ఏళ్ల సౌదామిని మహాలగా గుర్తించారు.
ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతిపై దుండుగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రియుడిని కొట్టి బంధించారు. సదరు విద్యార్థినిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని గోపాల్‌పూర్ బీచ్ లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రారంభంలో ఏడుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 10 మంది నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు.
హైదరాబాద్, ఒడిశాకు చెందిన పోలీసు బృందాలు శనివారం బాలాసోర్ జిల్లాలోని ఓ గ్రామంలో దాడి చేశాయి. ఈ దాడి అధికారులు సైతం ఆశ్చర్య పరిచింది. ఇక్కడ ఆవు పేడ కుప్ప నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం ఓ అధికారి వెల్లడించారు. కమ్రాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాదమందరుని గ్రామంలో ఈ రికవరీ చేసినట్లు తెలిపారు. వాస్తవానికి, హైదరాబాద్, ఒడిశా నుంచి పోలీసు అధికారుల బృందం గ్రామానికి చేరుకుంది.
Odisha custodial assault: ఒడిశాలో ఆర్మీ అధికారికి కాబోయే భార్యపై పోలీసులు కస్టడీలో దాడి చేయడం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా పోలీసుల తీరు ప్రజల్లో ఆగ్రహానికి గురైంది. ఈ ఘటన చర్చనీయాంశం కావడంతో ఉన్నతాధికారులు స్పందించి, మహిళపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేసింది. అయితే, ఈ ఘటన ఆర్మీ వర్సెస్ పోలీస్‌గా మారింది. చాలా మంది వెటరన్ ఆర్మీ అధికారులు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదిక…
Odisha : ఒడిశాలోని జగన్నాథ దేవాలయం చార్ ధామ్‌లలో ఒకటి. ప్రస్తుతం ఇది రత్నాల నిల్వల కారణంగా వార్తల ముఖ్యాంశాల్లో నిలిచింది. ఆలయంలోని రత్నాల దుకాణాన్ని మళ్లీ తెరవాలనే చర్చ జరుగుతోంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలనకు పెనుముప్పు తప్పింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల భారీ డంపును ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కిరిమితి, తులసి అటవీ ప్రాంతంలో భారీ డంప్ బయటపడింది.
రాత్రిపూట చెదురుమదురు ఘటనలు హింసాత్మకంగా మారగా, అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ వ్యక్తి మరణించిన తర్వాత శనివారం ఒడిశాలోని సంబల్పూర్ పట్టణంలో కర్ఫ్యూ విధించబడింది. శుక్రవారం సాయంత్రం హనుమాన్ జయంతి ఊరేగింపులు కట్టుదిట్టమైన భద్రతలో జరిగిన తరువాత హింస జరిగింది.
ఒడిశాలో మంగళవారం మరో రష్యన్ శవమై కనిపించాడని, పక్షం రోజుల్లో ఇది మూడోదని పోలీసులు తెలిపారు. జగత్సింగ్పూర్ జిల్లాలోని పారాదీప్ ఓడరేవులో లంగరు వేసిన ఓడలో మిల్యకోవ్ సెర్గీ అనే రష్యన్ వ్యక్తి శవమై కనిపించాడు.