Gali Janardhana Reddy: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన అక్రమ ఓబుళాపురం రవాణా మైనింగ్ కేసులో గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డికి శిక్ష పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు, రూ.10,000 జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుతో పాటు తాజాగా కర్ణాటక అసెంబ్లీ నుండి ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. Read Also: Operation Sindoor: మేడిన్ చైనా…
ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నట్లు మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటువంటి తీర్పులు వెలువడినప్పుడు మైనింగ్ లో అక్రమాలు చెయ్యాలనుకునే వారికి దడ పుడుతుందన్నారు.. ఇలాంటి కేసులకు ప్రత్యేక కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ చేపట్టి తీర్పుని వెలువర్చే విధంగా ఫాస్ట్ ట్రాక్ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఎంత ఆలస్యం అయితే అంత నీరుగారే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేశారు..
ఓబుళాపురం మైనింగ్ కేసులో తనను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పన్నెండు న్నరేళ్ల కిందట కోర్టు మెట్లేక్కినట్లు చెప్పారు. ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్ల ఎక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకమైన బాధ ఆరోజు కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అనుభవించానన్నారు.
గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నా వయసుతో పాటు సామాజిక సేవలను గుర్తించి శిక్షను తగ్గించాలని కోరాగా.. 10 సంవత్సరాల శిక్ష ఎందుకు వేయకూడదు అని అతడ్ని సీబీఐ కోర్టు జడ్జి ప్రశ్నించారు. మీరు యావ జీవ శిక్షకు అర్హులని తేల్చి చెప్పారు న్యాయమూర్తి. ఇక, తాను సామాజిక సేవ చేయడానికి ఇంకా నాలుగు సంవత్సరాల పైబడి ఉంది అన్నారు. ఈ నేపథ్యంలో శిక్ష తగ్గించాలని గాలి జనార్ధన్ రెడ్డి కోరారు.
Obulapuram Mining Case : అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ (ఓఎంసీ) కేసులో కీలక మలుపు వచ్చింది. హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ కేసులో తుది తీర్పు వెలువరించనుంది. ఈ కేసు దాదాపు 15 ఏళ్లుగా నడుస్తూ వస్తోంది. 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం సీబీఐకి దర్యాప్తు బాధ్యతలను అప్పగించింది. 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలైంది. అనంతరం మిగతా నిందితులపై అనుబంధ అభియోగ పత్రాలు దాఖలయ్యాయి. మొత్తం…
తెలుగు దేశం పార్టీకి చెందిన రెండు తెలుగు రాష్ట్రాల నేతలు ఒకేచోటికి వచ్చే విధంగా చేసింది ఓ పాత కేసు.. విజయవాడ కోర్టుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ మాజీ నేతలు హాజరయ్యారు.. టీడీపీకి చెందిన పాత నేతల అంతా ఒకేచోట కనిపించడంతో సందడి కనిపించింది.