Gali Janardhan Reddy: గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష..
- ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష..
- నా వయసుతో పాటు సామాజిక సేవలను గుర్తించి శిక్ష తగ్గించాలని వినతి..
- నేను ప్రజా సేవ చేయడంతో ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు: గాలి జనార్ధన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gali Janardhan Reddy: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు 14 ఏళ్ల విచారణ తర్వాత తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఐదుగురిని దోషులుగా, మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే, గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, గాలి పీఏ మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్‌గా ఉన్న వీడీ రాజగోపాల్‌ను కూడా దోషులుగా తేల్చింది. కాగా, వీరందరికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం.
Read Also: Viral Video: కేవలం రూ. 500కే ఐదు బ్లౌజులు.. దుకాణం ముందు బారులు తీరిన మహిళలు!
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
అయితే, విచారణ సందర్భంగా గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నా వయసుతో పాటు సామాజిక సేవలను గుర్తించి శిక్షను తగ్గించాలని కోరాగా.. 10 సంవత్సరాల శిక్ష ఎందుకు వేయకూడదు అని అతడ్ని సీబీఐ కోర్టు జడ్జి ప్రశ్నించారు. మీరు యావ జీవ శిక్షకు అర్హులని తేల్చి చెప్పారు న్యాయమూర్తి. ఇక, తాను సామాజిక సేవ చేయడానికి ఇంకా నాలుగు సంవత్సరాల పైబడి ఉంది అన్నారు. ఈ నేపథ్యంలో శిక్ష తగ్గించాలని గాలి జనార్ధన్ రెడ్డి కోరారు. బళ్లారితో పాటు గంగావతిలో తనను ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు గాలి. తాను ఇప్పుడు ప్రజా సేవ చేస్తున్నాను.. అందుకే ప్రజలు నన్ను ఆదరిస్తున్నారని గాలి జనార్ధాన్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Samantha: ఇక పర్సనల్ విషయాల గురించి మాట్లాడను
కాగా, ఓబులాపురం అక్రమ మైనింగ్‌పై 2009లో అప్పటి ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 2007 జూన్ 18వ తేదీన అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం దగ్గర 95 హెక్టార్లలో గాలి జనార్ధన్‌రెడ్డి కంపెనీకి ఇనుప ఖనిజం గనుల లీజులు కట్టబెట్టింది అప్పటి వైఎస్‌ఆర్ సర్కార్. అయితే, ఇనుప ఖనిజం తవ్వకాలు, రవాణా-అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో 2009 డిసెంబర్ 7వ తేదీన సీబీఐ కేసు ఫైల్ చేసింది. ఇక, 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేయగా.. గాలి జనార్దన్‌రెడ్డి, గాలి పీఏ మెఫజ్ అలీఖాన్, సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్, కృపానందం, బీవీ శ్రీనివాస్ రెడ్డిల పేర్లు ఛార్జిషీట్‌లో నమోదు చేర్చారు. మొత్తం 4 అభియోగపత్రాల్లో 9 మందిని నిందితులుగా సీబీఐ చేర్చింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు