వైసీపీ పదవులకు రాజీనామా చేసిన ఆ నాయకుడిది వ్యూహమా? లేక వైరాగ్యమా? పార్టీలోనే కొనసాగుతూ…. జిల్లా అధ్యక్ష పదవికి మాత్రం రాజీనామా చేయడాన్ని ఎలా చూడాలి? పవర్లో లేని పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ చేతి చమురు వదిలించుకోవడం ఎందుకని అనుకుంటున్నారా? లేక ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనుకుంటున్నారా? ఎవరా నాయకుడు? ఇలాంటి వ్యవహారాల్లో ఆయన గతం ఏం చెబుతోంది? ఏపీలో పొలిటికల్‌గా కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏలూరు ఒకటి. ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్…
ఆ నియోజకవర్గంలో రాజకీయం యమా రంజుగా మారుతోందట. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య యుద్ధం టామ్ అండ్ జెర్రీని తలపిస్తోందట. తగ్గేదే లే అన్నట్టుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో రక్తి కట్టిస్తున్నారు. ఛాన్స్ దొరికితే చట్రంలో ఇరికించే ప్రయత్నం జరుగుతున్న ఆ నియోజకవర్గం ఏది? ఎవరా ఇద్దరు నేతలు? శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారుతున్నాయి. సవాళ్ళు సెగలు రేపుతున్నాయి. ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి సీదిరి…
వైసీపీకి చెందిన ఆ రాజ్యసభ్యుడు టీడీపీలోకి జంప్ కొట్టేస్తారా? టీడీపీ గాలం ఆల్రెడీ ఆయనకు టచ్ అయిందా? పైకి ఆయన లేదు లేదంటున్నా…. ప్రచారం మాత్రం ఆగడం లేదు ఎందుకు? ఊ.. అంటావా…ఉఊ.. అంటావా అంటూ టీడీపీ ఎదురు చూస్తోందన్నది నిజమేనా? ఇంతకీ ఎవరా ఎంపీ? వెనకున్న కథేంటి? పిల్లి సుభాష్‌చంద్రబోస్…. వైసీపీకి వీర విధేయుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఏకైక రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడాయనకు టీడీపీ గాలం వేస్తోందన్న ప్రచారం కలకలం రేపుతోంది.…
పార్టీ మారిన, మారాలనుకుంటున్న ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ వైఖరి మారిందా? బతిమాలుకోవడాల ప్లేస్‌లోకి ఒక రకమైన బెదిరింపులు వచ్చేశాయా? డైరెక్ట్ వార్నింగ్స్ కాకుండా… కోర్ట్ తీర్పులు, రూల్స్ అంటూ జంపింగ్ జపాంగ్స్ ముందరి కాళ్ళకు బంధాలు వేయాలనుకుంటున్నారా? అలాంటివి ఎంతవరకు పనిచేసే అవకాశం ఉంది? సుప్రీంకోర్టు తీర్పును పదే పదే ప్రస్తావిస్తూ… సోషల్ మీడియా ప్రచారం చేయడం వెనకున్న ఉద్దేశ్యం ఏంటి? అవును బ్రదర్… మేం ఫిరాయింపుల్ని ప్రోత్సహించాం. అప్పట్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని లాక్కున్నాం. అయితే ఏంటి……
ఆ సీనియర్ నేత తీరు సొంత పార్టీ నేతలకే అర్ధం కావడం లేదట. ఎన్నికల ఫలితాల వచ్చాక ఎవ్వరికీ అందుబాటులో లేరు సరికదా… ఇప్పుడసలు రాజకీయాల్లో ఉంటారా? లేక ఆల్రెడీ పెట్టేబేడా సర్దేసుకున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయి. సొంత కేడర్‌కు సైతం కనిపించడం లేదు, గతంలో తాను నిర్వహించిన శాఖపై తీవ్ర ఆరోపణలు వచ్చినా స్పందించడం లేదు. ఇంతకీ ఏంటాయన అంతరంగం? ఎవరా మాజీ మంత్రి? వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అంతరంగం ఏంటో అర్థంగాక…
తెలంగాణ అసెంబ్లీలో అధికారపక్షం పైచేయి సాధించగలిగిందా? ఇన్నాళ్ళు పట్టు విడుపులతో నడిచిన సభ క్రమంగా ఏకపక్షం అవుతోందా? ఆ విషయమై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఎక్కడ విపక్షాన్ని డామినేట్ చేయగలిగింది అధికార పక్షం? మెయిన్ అపోజిషన్ ఎక్కడ కార్నర్ అయింది? అందులో కీలక పాత్ర ఎవరిది? తెలంగాణ అసెంబ్లీలో గడిచిన రెండు రోజులుగా అధికార పక్షం పైచేయి సాధించినట్లు కనపడుతోందంటున్నారు పరిశీలకులు. గత అసెంబ్లీ సమావేశాలకు, ప్రస్తుతం కొనసాగుతున్న సమావేశాల్లో పనితీరుని బేరీజు వేసుకుంటే…
ఆ ఉమ్మడి జిల్లాలో కారు పార్టీకి నాయకత్వం కరవైందా? నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు ఉన్నా లేనట్టుగా, పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారా? స్వయంగా కేటీఆర్ ఆందోళనలకు పిలుపునిచ్చినా… లైట్ తీస్కో బాసూ… అన్నట్టుగా ఉన్నారా? ఇప్పుడు అడుగు ముందుకేస్తే జేబులు గుల్ల తప్ప ప్రయోజనం లేదనుకుంటున్నారా? లేక పొలిటికల్ ముందు చూపుతో జాగ్రత్త పడుతున్నారా? ఏదా ఉమ్మడి జిల్లా? అక్కడ బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాజా మాజీ ఎమ్మెల్యేల తీరు పై.. గులాబీ క్యాడర్ గుస్సాగా…
తెలంగాణ అసెంబ్లీలో ఇక నుంచి పాత దృశ్యాలు కొత్తగా కనిపిస్తాయా? ప్రతిపక్షం విషయంలో కఠినంగానే ఉండాలని ప్రభుత్వం డిసైడ్ అయిందా? పద్ధతిగా సభ నడుపుదామని తాము అనుకుంటుంటే… ప్రతిపక్షం మాత్రం కట్టు తప్పి ప్రవర్తిస్తున్నట్టు సర్కార్ పెద్దలు భావిస్తున్నారా? ఆ విషయంలో సీఎం అంతరంగం ఎలా ఉంది? కనిపించబోయే కొత్త దృశ్యాలు ఏవి? ఇన్నాళ్ళు సజావుగానే సాగుతోంది తెలంగాణ అసెంబ్లీ. ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేసినా…, నిరసనలు స్పీకర్ పోడియం వరకు వచ్చినా, పెద్దగా పట్టించుకోలేదు ప్రభుత్వం.…
ఆ పార్టీలో ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియడం లేదా? బయటి వాళ్ళ సంగతి పక్కన పెట్టండి… కనీసం అందులోని ముఖ్య నాయకులనుకునే వాళ్ళకు సైతం వ్యవహారం బోధపడటం లేదా? ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే… హై కమాండ్‌కు కరెక్ట్ ఫీడ్ బ్యాకే వెళ్ళడం లేదా? ముఖ్య నేతలంతా… వ్యక్తిగత ప్రయోజనాల కోణంలోనే ఢిల్లీ పెద్దలకు నివేదికలు ఇస్తున్నారా? ఏదా జాతీయ పార్టీ? ఏం జరుగుతోంది అందులో? తెలంగాణ కమలం పార్టీలో పైకి కనిపించేది వేరు, లోపల జరుగుతున్నది వేరన్నట్టుగా…
ఏపీలో మరో రాజకీయ సంచలనానికి తెరలేవబోతోందా…? ప్రతిపక్షానికి ఊహించని షాక్ తప్పదా…? ఓ ఎంపీ అధికార కూటమికి అందులోకి వెళ్ళారా? అంతా రెడీ… ఇక గేటు తోసుకుని లోపలికి వెళ్ళడమే మిగిలిందా? అపోజిషన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు అధికారపక్షం అట్నుంచి నరుక్కొస్తోందా? ఆ ఎంపీ సైతం స్వామి భక్తికంటే సెల్ఫ్ రెస్పెక్టే ముఖ్యమని భావిస్తున్నారా? ఎవరాయన? ఏంటా కథ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందా? అంటే…. సంకేతాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోందంటున్నారు…