ఆ జిల్లాలో గులాబీ పార్టీ పూర్తిగా ఖాళీ అవబోతోందా? ఈపాటికే జరిగిపోవాల్సిన పనికి జస్ట్… ఆషాఢం అడ్డొచ్చిందా? శ్రావణ శుభ ఘడియలు చూసుకుని మరీ… కారులోంచి కాలు కింద పెట్టాలనుకుంటున్న ఆ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరు? కాంగ్రెస్ గూటికి చేరడానికి వాళ్ళు వేసుకుంటున్న లెక్కలేంటి? జరుగుతున్న ప్రచాకం ఏంటి? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పవర్ పోయినా… ఆ పార్టీ పట్టు నిలుపుకున్న నియోజకవర్గాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా అలంపూర్ ఒకటి. కారు పార్టీ అభ్యర్ధి విజయుడుకి…
రాష్ట్రంలో పార్టీకి పవరుంది… నాకు జైంట్ కిల్లర్ ఇమేజ్ ఉంది. ఇక అడ్డేముందనుకుంటూ…. నాడు అడ్డగోలుగా మాట్లాడారా మాజీ ఎమ్మెల్యే. అవతలోడు ఎవడైతే నాకేంటి అన్నట్టుగా…. అదే శాశ్వతం అన్న భ్రమలో బతికేశారు. ఓటర్లు లాగిపెట్టి కొట్టి చెంప ఛెళ్ళుమనిపించేసరికి… దెబ్బకు పవర్ నిశా దిగిపోయి ఊహల్లోంచి వాస్తవంలోకి వచ్చారు. కట్ చేస్తే… ఉన్న పార్టీలో విలువ లేదు. పక్క పార్టీల్లో శతృవులు పెరిగారు. దీంతో పొలిటికల్ వీఆర్ఎస్ ఆలోచనలు చేస్తున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు?…
వైసీపీలో ఒంగోలు వార్ మొదలైందా? జిల్లా అధ్యక్ష పదవి విషయంలో స్థానిక నేతలు గరం గరంగా ఉన్నారా? మమ్మల్ని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటే… ఆ తర్వాత మీ ఇష్టం అంటూ అధిష్టానానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారా? ఇంతకీ ఒంగోలులో ఏం జరుగుతోంది? స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నది ఎవర్ని? జిల్లా అధ్యక్ష పదవి చుట్టూ ముసురుకుంటున్న ముసలం ఏంటి? ఏపీలో వైసీపీకి పట్టున్న జిల్లాల్లో ప్రకాశం కూడా ఒకటి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి జిల్లాలో చెప్పుకోదగ్గ స్దానాలే…
మీరు క్యూలో ఉన్నారు…. దయచేసి కొద్ది రోజులు వేచి ఉండండి. మళ్ళీ ప్రయత్నించాలంటే మీకు అవకాశం దొరక వచ్చు, దొరక్కపోవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వినిపిస్తున్న ఫోన్ సందేశాలివి. ఎప్పుడు ఎవరు జంప్ చేస్తారో…. ఏ టైంలో కండువా మార్చేస్తారోనన్నంత ఉత్కంఠగా మారాయి పరిస్థితులు. ఇంతకీ గాంధీభవన్ క్యూలో ఉన్న ఆ గులాబీ ఎమ్మెల్యేలు ఎవరు? కొందరి విషయంలో వస్తున్న అభ్యంతరాలేంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుబెట్టి కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. ఎవరు ఎప్పుడొచ్చి ఠక్కున కండువా…
కంచుకోటలో కార్ పార్టీకి కేరాఫ్ మాయమైపోతోందా? చివరికి మేయర్ సీటు కూడా కారుజారిపోయే ముప్పు ముంచుకు వస్తోందా? మేయర్ కదలికలు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయా? ఇంతకీ ఏ మేయర్ సీటు గులాబీ దళానికి దూరమయ్యే ముప్పు ముంచుకు వస్తోంది? ఏ పార్టీ వైపు చూస్తున్నారా మేయర్? అంత జరుగుతున్నా…. బీఆర్ఎస్ నేతలు చేష్టలుడిగి చూస్తున్నారు ఎందుకు? కార్ పార్టీకి కంచుకోట కరీంనగర్. అనేక సంక్షోభ సమయాల్లో గులాబీ దళానికి అండగా ఉన్న జిల్లా ఇది. అసెంబ్లీ…
నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలలో పర్యటించనున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులను సీఎం పరిశీలించనున్నారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. నేడు కడపలో ఎంపీ సీఎం రమేష్ పర్యటించనున్నారు. అనకాపల్లి ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా కడప జిల్లాకు సీఎం రమేష్ వస్తున్నారు. ఆయనకు…
ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం జులై చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి.. తగిన సాయం కోరనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, రహదారులు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు, ప్రభుత్వ ప్రధాన…
సాధారణంగా సౌమ్యంగా ఉండే ఆ శాసనసభ్యురాలికి ఉన్నట్టుండి కోపం కట్టలు తెంచుకుంది. అది కూడా అలా ఇలా కాదు….. ప్రత్యర్థుల మీద బూతుల సునామీ విరుచుకుపడింది. అన్నీ డ్యాష్…. డ్యాష్… బూతులేనట. ఎందుకంత శివాలెత్తిపోయారా బీఆర్ఎస్ ఎమ్మెల్యే? నియోజకవర్గ పరిణామాల ప్రభావమా ? లేక మరో కారణమా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా బూతు పురాణపు కహానీ? కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యేకు ఎక్కడ లేని ఎప్పుడూ లేనంత కోపం వచ్చేసిందట. బీఆర్ఎస్ తరపున గెలిచిన కోవాలక్ష్మి…
టీడీపీ వేవ్‌ను తట్టుకుని నిలబడ్డ ఆ వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు నియోజకవర్గానికి కనీసం గెస్ట్‌గా కూడా రావడం లేదు. ఫలితాలు వచ్చాక జస్ట్ ఒకసారి అలా కనిపించి మాయమైపోయారు. పనుల కోసం సొంత పార్టీ వాళ్ళు ఫోన్ చేసినా… స్పందించకుండా.. కూల్ కూల్ అంటూ శాంతి మంత్రం జపిస్తున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయన పార్టీ మారతారన్న ప్రచారంలో నిజమెంత? కూటమి సునామీలో కూడా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు బాలనాగిరెడ్డి.…
ఓటమిపై మొన్న ఆవేదన.. నిన్న విశ్లేషణ.. నేడు అధినేత తప్పిదాలపై పరోక్ష విమర్శలు. వైసీపీలో స్వరం మారుతోందా? నేతలు ఒక్కొక్కరుగా ఓపెనైపోతున్నారా? ఆ మాజీ ఎమ్మెల్యే విశ్లేషణలకు పార్టీ వర్గాల్లో ఎందుకంత ప్రాధాన్యం దక్కుతోంది? ఆయన మాటలకు మద్దతు పెరుగుతోందన్నది నిజమేనా? ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఓటమిపై ఏంటి ఆయన విశ్లేషణ? కర్ణుడి చావుకి కారణాలెన్నో అన్నట్టుగా… ఏపీలో వైసీపీ ఓటమికి కూడా రకరకాల విశ్లేషణలు బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలో బయటి వాళ్ళు చెప్పే…