ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉండే ఆ నియోజకవర్గం రాజకీయం ఇప్పుడు ఇంకా ఘాటుగా మారింది. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా భూ యుద్ధం మొదలైంది. ఇద్దరిదీ ఒకే పార్టీ కాదు, ఒకే సెగ్మెంట్ కాదు… అయినా, యవ్వారం యమా ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఏకంగా అసెంబ్లీ దాకా వెళ్ళంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎవరా ఇద్దరు నాయకులు? ఆళ్ళగడ్డ…. ఆ పేరులోనే ఫైర్ ఉంటుంది. ఏదో ఒకరకమైన వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నానుతూ ఉంటుంది నంద్యాల జిల్లాలోని ఈ…
తెలంగాణలో కరెంట్ రాజకీయం హై వోల్టేజ్లో నడుస్తోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడుస్తున్న పవర్ పర్చేజ్ వార్‌లోకి తాజాగా బీజేపీ ఎంటరైంది. అందరి మాటా జనహితమే అయినా.. అందులో ఎవరి రాజకీయం వారిది. ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ… బీజేపీ తెర మీదికి తెచ్చిన తాజా పాయింట్ ఏంటి? దాని ప్రకారం ముందుకు వెళితే తెలంగాణ ప్రజల నెత్తిన బండేనని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంటోంది? కరెంట్ పేరుతో మొదలైన కొత్త రాజకీయం ఏంటి? తెలంగాణ…
బొగ్గు కార్మికులు భగ్గుమంటున్నారు. నమ్మి మిమ్మల్ని పెత్తనం చేయమంటే… నట్టేట ముంచుతున్నారంటూ కార్మిక సంఘాల మీద రగిలిపోతున్నారు. అది ఇది అని లేదు. అన్ని సంఘాల విషయంలోనూ అదే సీరియస్‌నెస్, అంతే నిలదీత. ఐక్య పోరాటాలు చేయాల్సిన టైంలో… శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఏంటా రాజకీయం అంటూ నిలదీస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో సింగరేణి కార్మికులు మండిపడుతున్నారు? తమ యూనియన్ నాయకుల్ని నిలదీస్తున్నారు? వాళ్ళలో అసహనం ఎందుకు పెరుగుతోంది? సింగరేణి బొగ్గు బ్లాక్‌లను వేలం వేయాలని…
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చేది ఎప్పుడు? అసలా విషయంలో పార్టీ హై కమాండ్ సీరియస్‌గా ఉందా? లేదా? మిగతా రాష్ట్రాల్లో నియామకాలు చేస్తున్న బీజేపీ పెద్దలకు తెలంగాణ ఎందుకు కొరుకుడు పడటం లేదు? అసలా విషయంలో ఏం జరుగుతోంది? కేడర్ మనోగతం ఏంటి? అధిష్టానం ఆలోచన ఎలా ఉంది? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రెండోసారి కేంద్ర మంత్రి అయ్యారు. ఆయనలాగే… వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు కూడా…ఈసారి కేంద్ర కేబినెట్ బెర్త్‌లు దక్కాయి. ఒక…
అదర్స్….. ఇతరులు… భాష ఏదైనా దాని భావం మాత్రం ఒక్కటే. ఆ పదమే ఇప్పుడు వైసీపీని షేక్ చేస్తోందట. ఏపీ పాలిటిక్స్‌లో దాని చుట్టూనే పెద్ద చర్చ జరుగుతోందంటున్నారు. కొందరు ద్వితీయ శ్రేణి వైసీపీ నేతలైతే… అదర్స్ అన్న పదం చెవినపడితే చాలు… నిద్రలో నుంచి సైతం ఉలిక్కిపడి లేచి కూర్చుంటున్నారట. ఇంతకీ అంత పవర్ ఏముందా పదంలో. దాని గురించి వింటే వైసీపీ నాయకులకు ఉలికిపాటు ఎందుకు? క్షేత్ర స్థాయిలో కొత్త పుంతలు తొక్కుతోంది ఏపీ…
అక్కడ జంపైపోవాలన్న నాయకులకు వ్రతం చెడ్డా ఫలితం దక్కడం అనుమానంగానే వుందా…?. షార్ట్ కట్ వ్యూహానికి అనూహ్యంగా బ్రేకులు పడ్డాయా…?. ఎగిరిపోతే ఎంత బాగుంటుంటీ… అని వాళ్ళు సాంగేసుకున్నా… మీరొస్తామంటే మేం వద్దంటామంటూ కొందరు నేతలు మోకాలడ్డుతున్నారా? పక్క పార్టీని ఖాళీని ఖాళీ చేసి సంస్థాగతంగా బలపడదామనుకుంటే సీన్ రివర్స్ అవుతోందా? ఇంతకీ ఎక్కడిదా జంపింగ్ గోల? త్రిశంకు స్వర్గంలో ఉన్న ఆ నాయకులు ఎవరు? తెలుగుదేశం పార్టీతో పవర్ షేరింగ్‌లో వున్న జనసేన సంస్థాగతంగా పార్టీ…
అక్కడ కాంగ్రెస్ రాజకీయం కాక రేపుతోంది. మాంఛి వర్షాకాలంలో కూడా సెగలు పుడుతున్నాయి. చూద్దాం… వెయిట్ చేద్దామన్నట్టుగా ఇన్నాళ్ళు ఉన్న ఎమ్మెల్యే ఒక్కసారిగా దూకుడు పెంచడంతో నియోజకవర్గంలోని మరో వర్గం ఉక్కిరి బిక్కిర అవుతోందట. పెద్దలు సెట్ చేయడానికి ప్రయత్నించినా… అది అతుకే తప్ప శాశ్వత పరిష్కారం కాదంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా నాయకులు. లోక్‌సభ ఎన్నికల తర్వాత…. తన నియోజకవర్గంలో దూకుడు పెంచారట మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. వరుస టూర్స్ వేస్తూ……
Ntv Reached JPL 2024 Finals: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ టీవీ ఛానెల్ ‘ఎన్టీవీ’.. జర్నలిస్టు ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) టీ20 టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్-1లో ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఏబీఎన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులకే పరిమితమైంది. అశోక్ చౌదరికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఏదో… కేసు పెట్టామంటే పెట్టామన్నట్టుగా కాకుండా… రెడ్ బుక్ రేంజ్లో ఆయన్ని బుక్ చేసే వ్యూహాలు సిద్ధమవుతున్నాయా? ఆయన ముఖ్య అనుచరుల మీద తాజా కేసులు, కొన్ని అరెస్ట్‌లే అందుకు సంకేతాలా? నియోజకవర్గానికి దూరంగా ఇప్పుడు వంశీ ఏం చేస్తున్నారు? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగించటానికి రంగం సిద్ధమవుతోందట. ఓ పద్ధతి ప్రకారం తప్పుల్ని ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం…
ఆ మామా అల్లుళ్ళకు కళ్ళ ముందు కనిపించిన దారులన్నీ మూసుకుపోయాయా? రెంటికీ చెడ్డ ఆ నాయకులు ఇద్దరూ … ఇప్పుడు కొత్త దారి వెదుక్కుంటున్నారా? అధికారంలో ఉన్నప్పుడు అడ్డూ అదుపూ లేకుండా వ్యవహరించడంతో పాటు ఇష్టానుసారం నోటికి పని చెప్పిన మాజీ మంత్రి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారా? ఎవరా మామా అల్లుళ్ళు? ఏంటి వాళ్ళ రాజకీయ ఇరకాటపు కథ? అధికారంలో ఉన్నప్పుడు అడ్డే లేదన్నట్టుగా చెలరేగిపోయిన మాజీ మంత్రి పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా…