మడిసన్నాక కూతంత కళా పోసన ఉండాలి… అన్నది రావు గోపాలరావు డైలాగ్. ఆ కళా పోసన ఉండటం వరకు ఓకేగానీ… అది శృతి మించి వెర్రి తలలు వేస్తే…. మొదటికే మోసం రావడం ఖాయం. ఇప్పుడా రాజకీయ నాయకుడి పరిస్థితి కూడా అలాగే ఉందట. ఆయనగారి కళాపోసన శృతిమించి కాదు, అంతకు మించడంతో టోటల్ పొలిటికల్ కేరీరే డేంజర్లో పడిందట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటాయనగారి జిల్ జిల్ జిగా జిగా స్టోరీ? వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ…
ఓ ఐపీఎస్ అధికారి ఇంతగా బరితెగిస్తారా..? నేరుగా ప్రభుత్వం మీదే కుట్రలు పన్నుతారా..? అది కూడా ప్రతిపక్ష పార్టీ ప్రాపకం కోసం చేస్తారా? ఇదీ ప్రస్తుతం ఏపీ పొలిటికల్ అండ్ అడ్మిన్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ. అసలేం జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో? వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్స్ గురించి అంతలా రచ్చ ఎందుకు అవుతోంది? ఖాళీ పీరియడ్‌ను వాళ్ళలో కొందరు వాడుతున్నారు? లెట్స్ వాచ్. గత ప్రభుత్వ పెద్దలతో పూర్తిగా అంటకాగి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు టీడీపీ…
ఆ ఫైళ్లలో ఏముంది…!?. ఎవరి లెక్కలు తేల్చడానికి ప్రభుత్వం రెడీ చేస్తోంది…!? గతంలో నిజంగానే తప్పులు జరిగాయా? జరిగిఉంటే అవి ఎవరి మెడకు చుట్టుకోబోతున్నాయి? ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడిదో విస్తృమైన చర్చ. ఇంతకీ ఏంటా ఫైల్స్? ఎందుకు అధికారులు సైతం అంతలా భయపడుతున్నారు? సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిన ఈ రాజకీయ కథా చిత్రం ఎప్పుడు విడుదలవుతుంది…?. ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఫైల్స్ సీరియల్ నడుస్తోంది. మదనపల్లె ఎపిసోడ్ కొలిక్కి రాకముందే విశాఖ ఫైల్స్ కాక…
తెలంగాణ బీజేపీ తేడాగా ఉందా? వ్యవహారం మొత్తం పైన పటారం లోన లొటారంలాగా మారుతోందా? పార్టీ నేతలు కలిసి పనిచేయడం అన్న మాట మర్చిపోయారా? సమన్వయం అన్న పదానికి పార్టీలో అర్ధం లేకుండా పోయిందా? అసలు పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఏంటి? వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న టార్గెట్ ఏమైంది? అన్నీ… పక్కన బెడదాం…, అందరం కలిసి ముందుకు సాగుదాం…. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద జెండా పాతేద్దాం…. ఇవీ కమలం పార్టీ పెద్దలు…
మొన్నటి వరకు బాలయ్యా… నువ్వు ఎక్కడయ్యా..? అంటూ తెగ ర్యాగింగ్ చేశారు వైసీపీ లీడర్స్. కానీ ఇప్పుడదే సీన్ రివర్స్ అవుతోందట. వైసీపీ లీడర్స్ టార్గెట్‌గా రివర్స్ పంచ్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. మేమిక్కడ… మీరెక్కడ అంటూ ట్రోల్ చేస్తున్నారట. ఇంతకీ ఏం జరుగుతోంది హిందూపురంలో. కొత్తగా వచ్చిన మార్పేంటి? నోరుందికదా అని ఏదిపడితే అది మాట్లాడకు రా… నాయనా… రేపు అది మనకు కూడా తగలొచ్చంటుూ జాగ్రత్తలు చెబుతుంటారు పెద్దలు. ఇప్పుడు ఇవే మాటల్ని రిపీట్…
ఆషాఢం ఆశాజ్యోతిలా కనిపించిన బీఆర్ఎస్ పెద్దలకు శ్రావణ గండం పొంచి ఉందా? ఎప్పుడు ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఊపిరి బిగబట్టి చూస్తున్నారా? రకరకాల రీజన్స్ చూపిస్తూ… పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు టెక్నికల్‌గా భయపడేలా చేయాలనుకుంటున్నారా? ఎమ్మెల్యేల ఫిరాయింపుల చుట్టూ మొదలైన కొత్త చర్చ ఏంటి? బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చాక వలసలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు కొందరు కూడా ఒక్కొక్కరే కొంత కాలంగా పార్టీని వదిలేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో…
పుట్టపర్తిలో కొత్తగా పొలిటికల్ ప్రకంపనలు రేగుతున్నాయా? లోకల్ వైసీపీ నాయకులు షేకవుతున్నారా? ఎప్పుడు ఏ అధికారి వచ్చి తలుపు తడతారోనని కంగారు పడుతున్నారా? ఎందుకంత కంగారు? పుట్టపర్తి మున్సిపాలిటీ కేంద్రంగా ఏం జరుగుతోంది? పాలకవర్గంపై ఉన్న గోల్మాల్ ఆరోపణలేంటి? శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు రాజకీయ నాయకులు , అధికారుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్నాయట. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. పనులు…
ప్రతిష్టాత్మకంగా మారిన విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నిక నుంచి టీడీపీ ఎందుకు తప్పుకుంది? ముందు ఒక ఊపు ఊగినా… తర్వాత వ్యవహారం ఎందుకు చప్పున చల్లారింది? వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక ఇక లాంఛనమేనా? ఫస్ట్ టైం ఈ ఫార్మాట్లోకి వచ్చిన సత్తిబాబు తనదైన శైలిలో పావులు కదిపారా? ఇదంతా ఆయన చాణక్యమా లేక టీడీపీ రాజకీయ నిబద్ధత నిలబడిందా? బొత్స సత్యనారాయణ….తెలుగు రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఆయన పోటీలో వుంటే…
ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల మీద టీడీపీ తరపున పోరాడారాయన. ఒక రకంగా చెప్పాలంటే… నియోజకవర్గంలో పార్టీకి కేరాఫ్. కానీ… ఎన్నికలకు ముందు టీడీపీని వదిలి వైసీపీ కండువా కప్పుకున్నారు. తీరా తాను మారిన పార్టీ ఓడిపోయి… పాత పార్టీ పవర్లోకి వచ్చేసరికి దాదాపు మైండ్ బ్లాక్ అయిందట. ఇప్పుడేం చేయాలన్నది ప్రశ్నార్థకంగా మారిన ఆ నేత ఎవరు? ఆయన గురించి జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీ పాలిటిక్స్‌లో పులివెందుల ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. పొలిటికల్‌గా…
అగ్రనేతల ఎఫైర్స్ వైసీపీకి తలపోటుగా మారుతున్నాయా? ఒకరు కాదు… ఇద్దరు కాదు… వరుసబెట్టి కీలక నేతలంతా ఎఫైర్స్ ఎపిసోడ్స్‌లో చిక్కుకోవడం పార్టీ కేడర్ని సైతం ఇరుకున పెడుతోందా? వీళ్ళ చేష్టలతో బయట తలెత్తుకోలేకపోతున్నామని కేడర్ తలలు పట్టుకుంటోందా? నాయకులంటే అవినీతి, అక్రమాల ఆరోపణలు రావడం సహజం కానీ ఇక్కడ వస్తున్నవన్నీ పరువు తక్కువ విషయాలు కావడం అగ్ర నాయకత్వానికి కూడా చికాకుగా మారిందా? ఈ ఎపిసోడ్ లో ఎవర్ని ఏం అనాలో తెలియక వైసీపీ పెద్దలు సైలెంట్‌గా…