Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ డెసిషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాక, ఆయన అభిమానుల్లోనూ టెన్షన్ రేపుతున్నాయి. వెండితెరపై తన గంభీరమైన డైలాగ్ డెలివరీతో రికార్డులు తిరగరాయాల్సిన మ్యాన్ ఆఫ్ మాసెస్, వరుసగా ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్లు ఇస్తూ వెళ్లడంపై స్వయంగా ఆయన అభిమానులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, అఖిల్ ‘లెనిన్’ ప్రాజెక్టులకు తన గొంతును అందించిన తారక్, తాజాగా విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకూ నేరేషన్ ఇస్తున్నారన్న వార్త ఫిలింనగర్లో సంచలనంగా మారింది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో, కేవలం పాత్రల పరిచయమే కాకుండా వెంకీ పాత్ర తాలూకు కీలకమైన బ్యాక్‌స్టోరీ, సినిమా మూల కథను తారక్ తన స్వరం ద్వారానే ఆడియన్స్‌కు వివరించనున్నారని సమాచారం. తెలుగు భాషపై ఉన్న అద్భుత పట్టు, బేస్ వాయిస్ కారణంగా మేకర్స్ ఆయన వెంటపడుతున్నప్పటికీ, ఈ వరుస వాయిస్ ఓవర్ల పరంపరపై అభిమానుల నుంచి విమర్శలు మొదలయ్యాయి.
ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా తారక్ ఫ్యాన్స్ కొందరు ఓపెన్‌గానే తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు. దేవర తర్వాత భారీ హైప్‌తో వచ్చిన ‘ వార్ 2’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాకపోవడం, మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ విషయంలో నెలకొన్న తీవ్రమైన సందిగ్ధత వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ‘డ్రాగన్’ సినిమాకు సంబంధించి అధికారిక విడుదల తేదీలు ప్రచారంలో ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో, ఎప్పుడు వెండితెరపైకి వస్తుందో ఎవరికీ స్పష్టత లేదు. ఇలాంటి కీలక సమయంలో సొంత సినిమాల షూటింగ్‌లు, రిలీజ్ ప్లాన్లను వేగవంతం చేయడం మానేసి, ఇతర హీరోల సినిమాలకు ప్రచారం కల్పించేందుకు వాయిస్ ఓవర్లు ఇవ్వడం ఏమిటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇతరుల సినిమాలకు బలం చేకూర్చే పనిలో పడి, తన సొంత చిత్రాల ట్రాక్‌ను తారక్ పక్కన పెడుతున్నారన్న ఫ్యాన్స్ ఆవేదన హాట్ టాపిక్ అయింది.
Also Read
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
తాజావార్తలు
-
YSRCP Nomination Row: ఏపీ స్థానిక ఎన్నికలపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు
-
Punganur Violence: పుంగనూరు ఘటనలో.. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 50 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు!
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!