సొంత పార్టీ నేతలు టార్గెట్‌గా రాజాసింగ్ చెలరేగిపోతుంటే… స్పందన లేదు ఎందుకు? తీవ్ర పదజాలం వాడుతున్నా… ఇటు ఖండనలు లేవు, అటు షోకాజ్ నోటీస్‌లు లేవు? గోషామహల్ ఎమ్మెల్యే విషయంలో కాషాయ పెద్దల వ్యూహం ఏంటి? క్రమ శిక్షణకు కేరాఫ్‌గా చెప్పుకునే పార్టీ నాయకత్వం ఎందుకు కామ్‌గా ఉంది? అసలు రాజాసింగ్ విషయంలో పార్టీ వైఖరేంటి? కొద్ది రోజులుగా సొంత పార్టీ బీజేపీ మీదికే అస్త్రాలు సంధిస్తున్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ మధ్య కాలంలో అయితే..…
ఆ మాజీ మంత్రుల్లో అసహనం టన్నులు టన్నులుగా పేరుకుపోతోందా? తమకు ప్రాధాన్యం దక్కకపోవడం ఒక ఎత్తయితే… జూనియర్స్ తెగ పెత్తనాలు చేస్తున్నారంటూ రగిలిపోతున్నారా? ఇన్నాళ్ళు సిన్సియర్‌గా ఉన్న సీనియర్స్… ఇప్పుడు పార్టీ లక్ష్మణ రేఖ దాటుతున్నారా? ఎవరా సీనియర్స్? వాళ్ళ మనోభావాలు ఎక్కడెక్కడ దెబ్బతింటున్నాయి? తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉత్తరాంధ్ర. కేడర్ నుంచి లీడర్స్ వరకు అందరిదీ… అధినాయకత్వం మీద వీరవిధేయతే తప్ప వ్యతిరేకత అన్న మాటే వినిపించదు. ఈ ప్రాంత నాయకత్వం పార్టీ క్రమశిక్షణ దాటి…
అదిగో..ఇదిగో… అంటారు.. తీరా ఆ టైం వచ్చేసరికి తూచ్… లేదు పొమ్మంటారు. ఊరించి ఊరించి ఊసూరుమనిపిస్తారు. తెలంగాణ ప్రభుత్వం విషయంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇది. ఇంతకీ ఏ విషయంలో సర్కార్ అంతలా టార్గెట్ అవుతోంది? ముందు ఆర్భాటపు ప్రకటనలు చేసి తర్వాత వెనక్కి తగ్గడం వెనకున్న రీజన్స్ ఏంటి? జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ రోజు గడిచిపోయినా… పథకం ప్రారంభంలేదు, అసలా ఊసేలేదు. ఎందుకలా…
జీవో ఇచ్చి 24 గంటలు కూడా గడవక ముందే ఏపీ సర్కార్ ఎందుకు యూ టర్న్ తీసుకుంది? తుని రైలు దహనం కేసు రీ ఓపెన్ కోసం ఉత్తర్వులు ఇచ్చి వెంటనే ఉపసంహరించుకోవడానికి కారణం ఏంటి? తెర వెనక కథ ఏం జరిగింది? పర్యవసానాలు గరించి ముందే ఆలోచించకుండా జీవో ఇచ్చేశారా? ఏ స్థాయిలో ఫైల్ కదిలి జీవో బయటికి వచ్చింది? ఉత్తర్వులు ఇచ్చిందెవరు? ఆపిందెవరు? కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌తో 2016 జనవరి 31న తునిలో…
రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కేబినెట్ మంత్రి పదవులు ఇప్పించగలుగుతారా? గాంధీభవన్‌లో ఆమె టిక్ పెడితే… ఏఐసీసీ ఆఫీస్‌లో ఓకే చేసేస్తారా? తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్కు అన్ని పవర్స్ ఉన్నాయా? లేకుంటే ఆశావహులు ఆమె చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు? కలుస్తున్న వాళ్ళకి ఆమె ఎలాంటి భరోసా ఇస్తున్నారు? మంచి తరుణం మించిన దొరకదు… నౌ ఆర్ నెవ్వర్ అన్నట్టుగా ఫీలవుతున్నారట తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. త్వరలోనే కేబినెట్ విస్తరణ జరగబోతున్నందున…ఆశావహులంతా… ఎవరికి వారు గట్టి ప్రయత్నాల్లో…
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విషయంలో… వైసీపీ రివర్స్ అటాక్ మొదలుపెట్టిందా? మైనింగ్ అక్రమాలపై సీఐడీ కాదు…. సీబీఐతో దర్యాప్తు చేయించమన్న డిమాండ్ వెనక వ్యూహం ఉందా? అధికార పార్టీ మీద పైచేయి సాధించేందుకు ప్రతిపక్షం ఓ పద్ధతిలో అడుగులేస్తోందా? ఇంతకీ వైసీపీ నయా స్ట్రాటజీ ఏంటి? అది ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది? మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్ సినిమాలో ట్విస్ట్‌లను తలపించింది. అజ్ఞాతంలో ఉన్న కాకాణిని… వెదికి…
ఆమె యాక్షన్‌కి… ఈయన రియాక్షన్. అప్పుడైనా…ఇప్పుడైనా… ఆమెకి కౌంటర్ వేసేది ఆయనేనా..? పార్టీ ఇక ఫుల్ పవర్స్ ఇచ్చేసిందా? అట్నుంచి ఎప్పుడు పొలిటికల్ మిసైల్ వదిలినా…. మన పార్టీకి ఎస్ 400లా అడ్డుకోవాల్సింది నువ్వేనని అధిష్టానం చెప్పేసిందా? ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? వాళ్ళ మధ్యనే పొలిటికల్ యుద్ధం ఎందుకు ఎక్కువగా జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అంటే…. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇష్యూ నే. బీజేపీ…కాంగ్రెస్ అంటూ మాటల తూటాలు ఎక్కు పెడుతున్నారామె.…
కొన్ని రోజులు మంట మీద పడ్డ మిరపకాయలాగా… చిటపటలాడిపోతారు. హాట్‌హాట్‌గా, ఘాటుగా కనిపిస్తారు. అంతలోనే… ఐస్ ముక్క పెట్టినట్టుగా కూల్ కూల్ అంటారు. పార్టీ వీడినా ఆ మాజీ ఎంపీని పాత బంధం అంత తేలిగ్గా వదలడం లేదా? గిల్లుకోవడాలు, గిచ్చుకోవడాలు, ఫైరైపోవడాలు అంతకంతకూ పెరుగుతున్నాయా? సడన్‌గా తన మాజీ బాస్ మీద ఆ మాజీ ఎంపీకి ఎదుకు ప్రేమ పుట్టుకొచ్చింది? ఎవరాయన? గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీ ఆఫీస్ ఎగ్జిట్ డోర్…
Vizag: విశాఖపట్నంలో ఎన్నారై మహిళ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఎన్టీవీ వరుస కథనాలపై పోలీస్ యంత్రాంగం కదిలింది. ఇప్పటి వరకు కేసును నీరుగార్చే ప్రయత్నంలో ఉండగా.. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి వరుసగా కథనాలు ప్రసారం అయ్యేసరికి పోలీస్ యంత్రాంగం ఒత్తిడిలోకి పోయింది.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం...ఒకప్పుడు ఫ్యాక్షన్ అడ్డాగా, బాంబుల గడ్డగా ప్రసిద్ధి. ఇక్కడ ఫ్యాక్షన్ కోరల్లో చిక్కి విలవిల్లాడిన కుటుంబాలు ఎన్నో. పార్టీలతో సంబంధం లేకుండా పర్సనల్ కక్షలతోనే నరుకుడు ప్రోగ్రామ్స్ నడిచేవి. అయితే... రెండు దశాబ్దాల నుంచి ఆ తీవ్రత బాగా తగ్గింది. రాజకీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది. ఆళ్ళగడ్డలో టీడీపీకి బలమైన క్యాడర్ వుందని చెబుతారు.