ఆ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలంతా… ఆ ఎంపీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎక్కడో స్విచ్చేస్తే… అక్కడ బల్బ్ వెలుగుతోందా..? అన్న-తమ్ముడు అనుకుంటూనే.. ఎందుకు లడాయి పెట్టుకుంటున్నారు? క్రమశిక్షణ అన్నది బ్రహ్మ పదార్ధంలా మారిపోయిందా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? కీచులాడుకుంటున్న ఆ నాయకులెవరు? ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పంచాయితీ గాంధీభవన్‌కి చేరింది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు ఆందోళన, పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదుల దాకా వచ్చేసింది వ్యవహారం. ఎంపీ మల్లు రవి టార్గెట్‌గా… పాలమూరు…
వెన్నుపోటు దినం ర్యాలీలు వైసీపీకి మాంఛి కిక్కు ఇచ్చాయా? ఆ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అని పార్టీ అధిష్టానం భావిస్తోందా? అందుకే సీక్వెల్‌ను సిద్ధం చేస్తోందా? ఏంటా కొనసాగింపు కార్యక్రమాలు? పార్టీ అధిష్టామం మనసులో ఏముంది? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. ఏడాది పూర్తయినా ఎన్నికల హామీలను మాత్రం అమలు చేయలేదంటూ ఆందోళన బాట పట్టింది వైసీపీ. ఫలితాలు వెలువడ్డ జూన్ 4న వెన్నుపోటు దినం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. నాడు…
ఎమ్మెల్సీ కవిత ఇక రాజకీయంగా ఒంటరేనా? ఆమె పొలిటికల్ స్టెప్స్ అన్నీ ఇక సోలోగా పడాల్సిందేనా? గులాబీ వాసన ఇక ఆమె దరిదాపులకు కూడా చేరదా? లేఖ రాజేసిన అగ్గి అంతకంతకూ అంటుకుంటోందా? తాజాగా నిజామాబాద్ టూర్ ఆ విషయాన్నే చెప్పేసిందా? అసలేం జరిగింది నిజామాబాద్‌లో? ఆమె పొలిటికల్ ఒంటరి అని ఎందుకు స్టాంప్ వేసేస్తున్నారు అంతా? మొన్నటి దాకా…. బీఆర్ఎస్లో ఆమె మాటకు తిరుగులేదు. అక్క నోటి నుంచి మాట రావడమే ఆలస్యం… ఆచరణలో పెట్టేందుకు…
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది పాస్? ఎందరు ఫెయిల్? ఏడాది పాలనలో ఎవరెవరి తీరు ఎలా ఉంది? మేటర్ తేల్చడానికి పార్టీ అధిష్టానం ఏం చేస్తోంది? ఆల్రెడీ ఎవరేంటో తేల్చే పని మొదలైందా? రిపోర్ట్‌ని బట్టి ఈసారి యాక్షన్ మామూలుగా ఉండదా? ఎమ్మెల్యేల ప్రోగ్సెస్ కార్డ్‌పై టీడీపీ వర్గాలు ఏమంటున్నాయి? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైంది. గతంలో కనీవినీ ఎరుగని మెజార్టీతో మూడు పార్టీలు కలిసి అధికారం చేపట్టాయి. ఆ బలం ఇచ్చిన కిక్కుతోనే……
పచ్చని పల్లెల్లో ఇథనాల్ చిచ్చుపెడుతోంది. కంపెనీ మళ్లీ పనులు స్టార్ట్ చేయడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఉద్యమిస్తున్న రైతులకు మేమున్నామంటూ అభయం ఇచ్చిన రాజకీయ నేతలు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. ఇంతకీ…ఇథనాల్ కంపెనీ రగడ వెనుక ఎవరున్నారు? గద్వాల జిల్లాలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు వివాదం చెలరేగుతోంది. రాజోలి మండలం పెద్ద ధన్వాడ శివారులో 29 ఎకరాల్లో 189 కోట్ల రూపాయలతో గాయత్రీ రెన్యూవబుల్ ఫ్యూయల్స్ ఇథనాల్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వంలో 2023…
సింహపురి పాలిటిక్స్‌లో ఆయనో సీనియర్ నేత. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంటు జనాల్లో బలంగా ఉండేది. అదే సెంటిమెంట్‌ను నమ్ముకొని గత ఎన్నికల్లో పోటీ చేసినా..అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అనంతరం వైసీపీ అధిష్టానం ఆయనకు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించింది. మరి…అలాంటి నేతను జిల్లా నాయకత్వం లైట్ తీసుకుంటోందా?ఏ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదా?ఇంతకీ ఎవరు ఆ సీనియర్ పొలిటీషియన్?ఆయన అనుచరుల బాధేంటి? నెల్లూరు జిల్లా పొలిటికల్ స్క్రీన్‌పై మాజీ ఎంపీ ఆదాల…
అధికారంలో ఉన్నంతకాలం తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాన్ని వైసీపీ అడ్డాగా మారుస్తానన్నారు. ఎమ్మెల్యేగా పనిచేసినంత కాలం నేను-నా బలగం అంటూ మరొకరికి అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు అదే నాయకుడు కనీసం నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకోవటం లేదు. ఇంతకీ…ఎవరా నాయకుడు?ఏంటా నియోజకవర్గం? పొలిటికల్ హైడ్రామాకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే దెందులూరు నియోజకవర్గానికి 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు కొఠారు అబ్బయ్య చౌదరి. ఓటమి తర్వాత నియోజకవర్గాన్ని…
ఆ నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కింది. ఇప్పుడే ఎన్నికలు జరుగుతున్నాయనేంత రేంజ్లో నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అధికార-విపక్ష నేతల మధ్య సవాళ్లు-ప్రతిసవాళ్లు నడుస్తున్నాయ్. చిన్న వివాదమే రెండు పార్టీల మధ్య చిచ్చు రేపింది. ఇంతకీ…ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఖమ్మం జిల్లా పాలేరులో ప్రస్తుతం రాజకీయం వేడెక్కుతోంది. అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్ష పార్టీ నేతల పర్యటనలు సాగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ ఇంతలా రాజకీయాలు సాగడం లేదట. ప్రతిపక్ష నేతల…
ఆ కాంగ్రెస్ ఎంపీ… బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఎందుకు భేటీ అయ్యారు? అధికారిక కార్యక్రమం అయ్యాక ప్రైవేట్ మీటింగ్ మతలబేంటి? ఎమ్మెల్యే కారు దిగేస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ఎంపీ టూర్ కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌ని బయటపెట్టిందా? ఎవరా ఎంపీ, ఎమ్మెల్యే? వాళ్ళ మీద రూమర్స్ ఎందుకు మొదలయ్యాయి? నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ అయ్యాక తొలిసారి గద్వాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు,…
బాలినేని శ్రీనివాసరెడ్డి… ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీనియర్ పొలిటీషియన్. నాడు వైఎస్ కేబినెట్లో, 2019 తర్వాత జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారాయన. ఎవరు అవునన్నా.. కాదన్నా.. నాడు మంత్రివర్గ విస్తరణలో జగన్ బాలినేనిని కేబినెట్ నుంచి తప్పించడంతోనే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని అంటారు. ఆ గ్యాప్ అంతకంతకూ పెరిగిపోయి…. చివరికి ఫ్యాన్ కింది నుంచి పక్కకు జరిగి గ్లాస్ పట్టుకున్నారు బాలినేని. అలా… ఆయన జనసేనలో చేరిపోయాక ప్రకాశం జిల్లా రాజకీయం ఒక్కసారిగా మారిపోతుందని భావించారు…