Off The Record : తుంగతుర్తిలో ఎంపీ, ఎమ్మెల్యే వార్ డైరెక్ట్ అయ్యిందా?
- ఎంపీ సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీపై ఎమ్మెల్యే ఆగ్రహం
- నేను పని చేయకుంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చన్న మందుల
- నేనుండగా మీరు చెక్కులెలా ఇస్తారంటూ ఎమ్మెల్యే ఫైర్
- ఎవరికి వాళ్ళు ఇలా చేస్తే ఎమ్మెల్యేగా నేనెందుకని ప్రశ్న
- నన్ను కాదని వేరే వర్గాలను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ నియోజకవర్గంలో కోల్డ్ వార్ ఓపెనైపోతోందా? ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా అగ్గి అంటుకుందా? ఎమ్మెల్యే క్లియర్‌గా, క్లారిటీగా చెప్పిన తాజా మాటలు కేవలలం ఎంపీకేనా? లేక అక్కడ పట్టున్న కాంగ్రెస్ సీనియర్స్ అందరికీనా? ఎవరా ఇద్దరు ప్రజాప్రతినిధులు? ఏంటా ఫ్రస్ట్రేషన్ కహానీ? తుంగతుర్తి కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఇన్నాళ్ళు భిన్న వర్గాల కార్యకర్తల మధ్యే వాగ్వాదం, ఘర్షణలు, తోపులాటలు, ఫ్లెక్సీలు చింపుకోవడాలు జరగ్గా…ఇప్పుడిక అసలు నాయకుల వంతు వచ్చింది. తాజాగా ఎమ్మెల్యే మందుల సామేల్…, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే రచ్చ రచ్చ జరిగింది. ఎమ్మెల్యే… ఎంపీని ఉద్దేశించి పరోక్షంగా ఆయన సమక్షంలోనే చేసిన కామెంట్స్ ఇద్దరు నేతల అనుచరుల మధ్య వాదులాటకు దారితీశాయి.
స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే… భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం సామేల్ ఆగ్రహానికి కారణం కాగా.. చామల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారాయన. తుంగతుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నాడని, ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకే చెందిన వారని గుర్తుంచుకోవాలన్నారాయన. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ధరఖాస్తు చేసుకున్న వారికి తానుగాని, తన కార్యాలయంగాని సాయం చేయకపోయినా, చెక్కులు ఇవ్వకపోయినా..,
ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను నిరాకరించినా.. ఎంపీ దగ్గరికైనా, మరో నాయకుడి దగ్గరికైనా వెళ్ళవచ్చని, అలా కాకుండా… నేనుండగానే… నన్ను కాదని నేరుగా ఎంపీ దగ్గరికి కొందరు నాయకులు వెళ్లడం, వాళ్ళతో ఉన్న వాళ్ళకు ఆయన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు ఇప్పించడం ఏంటని సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్యే మందుల సామేల్. నేను కాదంటే కదా… మీరు జోక్యం చేసుకోవాల్సింది అని ఎమ్మెల్యే సూటిగా ఎంపీ చామలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
నియోజకవర్గంలో కొందరు నేతల అతి జోక్యానికి ఇది పరాకాష్ట అన్న చర్చ జరుగుతోంది హస్తం సర్కిల్స్‌లో. అయితే… నేనుండగా మీరెందుకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ పని చేస్తున్నారని ఎమ్మెల్యే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చానీయాంశంగా మారింది. ఈ రకంగా ఎవరికి వారి నియోజకవర్గంలోకి వచ్చి చెక్కులు ఇచ్చేసి, నామినేటెడ్ పదవులు పంపిణీ చేసేసి…ఇతర అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటే.. ఇక ఎమ్మెల్యేగా నేనెందుకు ఉండటం అంటున్నారు సామేల్. కొందరు ముఖ్య నేతలు, సీనియర్లు కనీసం ప్రోటోకాల్ పాటించకుండా.. ఇష్టం వచ్చినట్లు తుంగతుర్తిలో జోక్యం చేసుకోవడం వల్లే ఇక్కడ హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తం అవుతోందని అంటున్నారు శాసనసభ్యుడు. ఆ వర్గపోరే వివాదాలకు కేంద్ర బిందువు అవుతోందన్నది ఆయన వెర్షన్.
Also Read
ఎంపీ అయినా… ఇతర నాయకులైనా… స్థానిక ఎమ్మెల్యేను కాదని నియోజకవర్గంలో వేరే వర్గాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు మందుల. నేనేం ఎన్నికలకు ముందు వచ్చిన ప్యారాచూట్ నేతను కాదు, నాకు ఉద్యమ నేపధ్యం ఉంది..ప్రజా జీవితంలో 5 దశాబ్దాలుగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. అందరు నాయకులు ప్రచారం చేసారు, ప్రజలు గెలిపించారంటూ ఘాటుగా, డీటైల్డ్‌గా రియాక్ట్ అవుతున్నారు సామేల్. ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామినన్న విషయాన్ని గుర్తించకుంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారాయన. భువనగిరి యంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో సహా… తుంగతుర్తి నియోజకవర్గంపై పట్టున్న పలువురు సీనియర్ నేతలు కూడా… ఒక పద్ధతంటూ లేకుండా… ప్రోటోకాల్ పాటించకుండా ఎవరంటే వారిని ప్రోత్సహించడం వల్లే.. గ్రూప్ రాజకీయాలు ఇలా తగలడ్డాయంటూ మండిపడుతున్నారు మందుల. ఎమ్మెల్యే ఆగ్రహానికి, అసంత్రుప్తికి తాజా ఘటన పరాకాష్టగా చెప్పుకుంటున్నారు హస్తం నాయకులు. స్థానిక సంస్ధల ఎన్నికలు జరగబోతున్న ఈ టైంలో ఇలాంటి పరిణామాలు కరెక్ట్ కాదన్నది కేడర్ మాట. మొత్తం మీద ఇన్నాళ్లు నిరువుగప్పిన నిప్పులా ఉన్న తుంగతుర్తి హస్తం రాజకీయం ఇప్పుడిప్పుడే బ్లాస్టింగ్ స్టేజ్‌కు వస్తోందని,
గాంధీ భవన్ పెద్దలు వెంటనే జోక్యం చేసుకోకుంటే… దాని పరిణామాలు ఎట్నుంచి ఎటు పోతాయో చెప్పలేమంటున్నారు లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలు.
తాజావార్తలు
-
Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
ట్రెండింగ్
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!